చికెన్ అంటే ఎంతోమంది ఆహారప్రియులకు ఇష్టం.. అలాంటి ఈ చికెన్ ఇప్పుడు వైరస్ లా కారణంగా పూర్తిగా పడిపోయింది.. అయినప్పటికీ సిటీలలో ఈ చికెన్ డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు.. చికెన్ అంటే చాలు పడి చస్తున్నారు ప్రజలు. అలాంటి చికెన్ ప్రియులు చాలా మందే ఉన్నారు.. అయితే ఫ్రైడ్ చికెన్ అంటే చాలామందికి ఇష్టం.. దాన్ని ఎలా చేస్తారు అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. 

 

కావాల్సిన పదార్ధాలు.. 

 

బోన్‌లెస్‌ చికెన్‌- పావుకిలో, 

 

అల్లం ముద్ద- 2 టీస్పూన్లు, 

 

వెల్లుల్లి ముద్ద- టీస్పూను, 

 

పచ్చిమిర్చి ముద్ద- టీస్పూను, 

 

మైదా- 4 టీస్పూన్లు, 

 

కాశ్మీరీ కారం- టీస్పూను, 

 

దనియాల పొడి- టీస్పూను, 

 

చాట్‌మసాలా- అరటీస్పూను, 

 

నిమ్మరసం- 2 టీస్పూన్లు, 

 

ఉల్లిపాయ- ఒకటి, 

 

ఎరుపు రంగు- చిటికెడు, 

 

నూనె- సరిపడేంత, 

 

ఉప్పు- తగినంత.

 

తయారీ విధానం.. 

 

ఉల్లిపాయను పేస్టులా చేయకుండా చాలా సన్నగా తరగాలి. వెడల్పాటి గిన్నెలో చికెన్‌ ముక్కలు వేసి నూనె తప్ప మిగిలిన అన్ని దినుసులన్నీ వేసి బాగా కలిపి అరగంటసేపు నాననివ్వాలి. ఆ తర్వాత పాన్ లో నూనె వేసి వేడి అయ్యాక చికెన్‌ ముక్కల్ని కొంచెం కొంచెంగా వేసి వేయించి తీయాలి. అంతే.. ఫ్రైడ్ చికెన్ రెడీ.. 

మరింత సమాచారం తెలుసుకోండి: