శరీరంలో నొప్పులు మురియు అలసటకు గురిచేసేది గర్భధారణ సమయం. తలనొప్పి అనేది గర్భాధారణ సమయంలో వచ్చే అతి సాధారణమైన నొప్పి. గర్భధారణ సమయంలో తలనొప్పితో ఒక్కోసారి చాలా ఇబ్బంది పడవల్సి వస్తుంది. గర్భధారణ సమయంలో వచ్చే తల, మొడనొప్పి అంత తీవ్రమైనవి కాకపోవచ్చు. అయితే ఇవి అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా పనిచేసే(ఉద్యోగస్తులు) అయితే, అటువంటి వారిలో వచ్చే తలనొప్పి ఖచ్చితంగా సమస్యాత్మకంగా ఉంటుంది. గర్భధారణ సమయంలో వచ్చే తలనొప్పి నివారణ కోసం మాత్రలు తీసుకోవడం మంచిది కాదు. అయితే గర్భధారణ సమయంలో వచ్చే తలనొప్పికి కారణాలు తెలుసుకుంటే, మీరు తప్పకుండా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. గర్బధారణ సమయంలో వచ్చే తలనొప్పులకు కొన్ని ముఖ్య కారణాలు ఏమిటో ఈ రోజు అమ్మ శీర్షిక‌లో తెలుసుకుందాం...

 

ఎప్పుడైతే ఎక్కువ ఒత్తిడికి లోన‌వుతామో..అప్పుడు  తలనొప్పికి గురిఅవుతారు. గర్భధారణ సమయంలో ముఖ్యంగా మొదటి మూడు నెలలో మీ శరీరం మనస్సు చాలా ఒత్తిడితో కూడి ఉంటుంది. మొదటి మూడు నెలలు అసౌకర్యంగా ఎప్పుడూ అలసట, వికారం మరియు గర్భధారణకు మీ శరీరాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం వల్ల ఒత్తిడి, టెన్షన్ హెడ్ ఏక్ వంటివి వస్తాయి. అయితే టెన్షన్ హెడ్ ఏక్ ను తగ్గించుకోవడానికి వేరే మార్గం లేదు. అందుకోసం రిలాక్స్ టెక్నిక్స్(మెడిటేషన్ మరియు యోగా) పాటిస్తే చాలా వరకూ తలనొప్పిని తగ్గించుకోవచ్చు.

 

 గర్భధారణ సమయంలో శరీరంలోని అనేక హార్మోనుల మార్పుల వల్ల కొన్ని సమయాల్లో తలనొప్పిక కారణం అవుతుంది. ఈ హార్మోనల్ హెడ్డేక్ నుండి ఉపశమనం పొందడానికి ఫ్రెష్ ఎయిర్ ను పీల్చడం కానీ లేదా మనస్సును ఆహ్లాదపరిచే మూడ్ బూస్టింగ్ ఫుడ్ అంటే చాక్లెట్ వంటివి తినడం వల్ల చాలా వరకూ ఉపశమనం పొందవచ్చు. ఎప్పుడైతే ప్రెగ్నెంట్ గా ఉంటారో, అటువంటి సమయంలో మీరు కొంచెం కూడా కష్టమైన పనులు చేయకున్నా కూడా మీ శరీరానికి రెగ్యులర్ డోస్ ఎనర్జీ చాలా అవసరం. మద్యహ్న సమయంలో వచ్చే తలనొప్పి కారణం? బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గిపోవడమే. అటువంటి సమయంలో ఏదైనా ఒక ఎనర్జీ డ్రింక్ ను తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్‌ చేస్తుంది.

 

 మీరు పొగత్రాగేవారైనా లేదా కెఫిన్ కు పూర్తిగా బానిస అయినా..అప్పుడు మీరు గర్భధారణ సమయంలో వచ్చే తలనొప్పితో పోరాడవల్సిందే. మీ డాక్టర్ మీకు పొగత్రాగడం మానేయమని లేదా కెఫిన్ తగ్గించమని సలహా ఇస్తారు. మీ తలనొప్పికి ఈ యాంగ్‌జైటీనెస్ త‌గ్గించుకోవ‌డం వల్ల కూడా తలనొప్పిని నివారించుకోవచ్చు.  గర్భధారణ సమయంలో మ‌న శ‌రీరం మ‌న‌కు తెలియ‌కుండానే సున్నితంగా ఉంటుంది. దీంతో  పెద్ద శబ్ధాలు, ఎక్కువ మాట్లాడటం మరియు ట్రాఫిక్ వల్ల తలనొప్పికి కారణం కావచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: