మ‌హిళ‌కు మాతృత్వం ఓ వ‌రం. సాధార‌ణంగా వివాహం అయిన ప్ర‌తి స్త్రీ తాను త‌ల్లి కావాల‌ని ఖ‌చ్చితంగా అనుకుంటుంది. ఇక అనుకున్న‌ట్టుగానే త‌ల్లి అయితే ఆమె ఆనందానికి అవ‌ధులు ఉండ‌వు. అయితే కేవ‌లం ఒక శిశువే కాక క‌వ‌ల‌లు గ‌ర్భంలో ప‌డితే ఇంక ఆ ఆనందం మ‌రింత రెట్టింప‌వుతుంది.  ఇక చాలా మంది దంపతులు తమకు కవలలు పుట్టాలనుకుంటారు. ఇంట్లో కవలలు పుట్టడం,కుటుంబానికి అదృష్టం అని కూడా చాలా మంది భావిస్తారు. అదృష్టం ఏమో కానీ, పుట్టిన ఇంటికి ఆనందాన్ని,  సంతోషాన్ని మాత్రం తీసుకొస్తారు. అయితే కవలలు పుట్టడానికి ఎం చేయాలి? ఇలా చేస్తే కవలలు పుడతారు అనే శాస్త్రీయ పద్దతి ఏది లేదు. 

 

కానీ కవలలు పుట్టడానికి అవకాశాన్ని పెంచే కొన్ని చిట్కాలు అయితే ఉన్నాయి. మీ వంశంలో ఇంతక ముందు కవలలు పుట్టివుంటే, మీ కూడా కవలలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వంశపారంపర్యంగా వచ్చే జీన్స్ కవలలు పుట్టడంలో, ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాగే ఎక్కువ పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవడం వలన, మీరు ఎక్కువ ఫెర్టైల్ అవుతారు. దీంతో మీకు కవలలు పుట్టే అవకాశం పెరుగుతుంది. మ‌రియు ఆరోగ్యకరమైన పాల పదార్ధాలు తీసుకోవాలి. పాలతోపాటు వెన్న, చీజ్, ఇతర పాల పదార్ధాలను మీ ఆహారంలో తీసుకోవడం వల్ల కవలల గర్భధారణ పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 

 

ఆవులలో ఎదుగుదలకు అవసరమైన ఇన్సులిన్ ఉండడం వల్ల, పాల పదార్ధాలు తీసుకుంటే సహజంగా కవలలను గర్భం దాల్చడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫోలిక్ ఆసిడ్ అధికంగా ఉండే ఆహారం తీసుకోండి. బీన్స్, సిట్రస్ ఫ్రూట్స్, ఆకు కూరలు లాంటి ఆహారాలు తీసుకోవడం వలన మీకు కావాల్సిన ఫోలిక్ యాసిడ్ అందుతుంది. దీంతో మీకు కవలలు పుట్టే అవకాశం పెరుగుతుంది. ఇక చాలామంది కుటుంబ నియంత్రణకు అనేక రకాల మందులు వాడుతుంటారు. మీరు కావల గర్భధారణను పొందాలి, పిల్లలు కావాలి అనుకుంటే ముందే అటువంటి మందులను మానేయండి.

 
 
  
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: