కొంత మంది పిల్ల‌లు పుట్టాక అనారోగ్యం వ‌ల్ల‌నో లేదా ఏదో కొన్ని కార‌ణాల వ‌ల్ల త‌ల్లి చ‌నిపోతే... తండ్రి పిల్ల‌ల పెంప‌కం కోసం వేరే వివాహం చేసుకుంటారు. మ‌రి అలాంట‌ప్పుడు ఆ త‌ల్లి పిల్ల‌ల‌ను చూసే తీరు ఎలా ఉంటుందంటే... కొంత మంది మంచిగా ప్రేమ‌గా చూసుకుంటారు కానీ కొంత మంది మాత్రం ఆ పిల్ల‌ల ప‌ట్ల క‌ఠినంగా ప్ర‌వ‌ర్తిస్తూ ఉంటారు. అభం శుభం తెలియ‌ని ఆ పిల్ల‌లు ఎవ్వ‌రికీ చెప్పుకోలేక విల‌విల‌లాడుతుంటారు. కానీ అలాంటి ప‌రిస్థితులు అస‌లు ఎందుకు వ‌స్తాయి. త‌ల్లి అంటే త‌ల్లే క‌దా ప్ర‌తీ బిడ్డ‌కు త‌న త‌ల్లి అందించినంత ప్రేమ‌ను అందించ‌లేక‌పోయిన‌ప్ప‌టికీ క‌నీసం మ‌రీ క‌ఠినంగా ప్ర‌వ‌ర్తించ‌కుండా ఉంటే స‌రిపోతుంది.కానీ ఇప్ప‌టివర‌కు ఇలాంటి కేసులే మ‌నం ఎక్కువ  చేశాం.

 

కొంత మంది అయితే పిల్ల‌ల‌ను కొట్ట‌డం .. అలాగే పిల్ల‌ల ప‌ట్ల అమానుషంగా ప్ర‌వ‌ర్తించ‌డం వ‌ల్ల వారికి త‌ల్లి అంటేనే భ‌యం వేసేలా చేస్తుంటారు. ఏ మాత్రం వారిని ద‌గ్గ‌రికి తీసుకుని మంచిగా లాలించ‌రు. అదే క‌న్న త‌ల్లి అయితే కొట్టినా కూడా ఒకానొక సంద‌ర్భంలో ద‌గ్గ‌ర‌కి తీసుకుని మ‌ళ్ళీ లాలిస్తుంది. అదే స‌వ‌తి త‌ల్లి అయితే అలాంటిదేమీ ఉండ‌దు. ఇక అలాగే ఆస్తి విష‌యాల‌కి వ‌స్తే ముందుగానే పిల్ల‌ల పేరు మీద ఏద‌న్నాపెట్టి అప్పుడు తండ్రికి రెండో వివాహం చేస్తారు చాలా మంది ఎందుకంటే రేపు వ‌చ్చిన త‌ల్లి పెట్ట‌నిస్త‌దో లేదో అని ఇలా ర‌క ర‌కాల అనుమానాలు ఉంటాయి.

 

ఇక ఆడ‌పిల్ల‌ల విష‌యంలో అయితే ఖచ్చితంగా త‌ల్లి లేక‌పోతే చాలా ఇబ్బంది ప‌డుతుంది. మంచి చెడు చెప్పేవారు ఎవ్వ‌రూ ఉండ‌రు. మ‌గ‌పిల్లాడు అంతా కాస్త ప‌ర్వాలేదు ఎలాగైన ఉంటాడు కానీ ఆడ‌పిల్ల‌కు అలా కాదు ఏ చిన్న క‌ష్ట‌మొచ్చినా తండ్రికంటే ముందు త‌ల్లికి చెబుకుంటారు కానీ ఆ త‌ల్లే వినే ప‌రిస్థితుల్లో లేక‌పోతే. ఆ బాధ వ‌ర్ణ‌నాతీతం అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: