భారతీయ సిని పరిశ్రమలో ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పేరు... ప్రియాంకా చోప్రా. సినిమాను ఆమె ప్రేమించిన విధానం ఎందరో హీరోయిన్లకు ఆదర్శం. కెరీర్ తొలి రోజుల్లో ప్రియాంకా చోప్రా సినీ జీవితం ఎన్నో ఇబ్బందులు పడింది. ఆమె కెరీర్ లో ఊహించని ఇబ్బందులు పడింది. కొందరు దర్శకులు ఆమెకు చుక్కలు చూపించారు. మొదటగా భారత ప్రపంచ సుందరిగా ఎన్నిక అయిన చోప్రా తరువాత 2000వ సంవత్సరంలో ప్రపంచ సుందరి కిరీటాన్ని చేజిక్కించుకుంది. ప్రపంచ సుందరి బిరుదు దక్కించుకున్న తరువాత చోప్రా నటి అయ్యింది. 

 

బాలీవుడ్ పరిశ్రమలోనికి ప్రవేశించకముందు 2002వ సంవత్సరంలో విజయ్ సరసన తమిళ చిత్రం తమిళన్ ద్వారా చిత్రసీమలోకి రంగప్రవేశం చేసింది, ఈ చిత్రంలో ఆమె ఒక పాటను కూడా పాడారు. 2003వ సంవత్సరంలో తన మొట్టమొదటి బాలీవుడ్ చిత్రం ది హీరో: లవ్ స్టొరీ ఆఫ్ ఎ స్పై విడుదలై మంచి విజయం సాధించింది. ఆ సినిమా తర్వాత ఆమె కెరీర్ ఊపందుకుంది. ఆ తర్వాత కూడా ఆమెను కొందరు దర్శకులు ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు నాలుగు పదుల వయసుకి దగ్గరగా ఉంది ప్రియాంకా. అయినా సరే ఆమె డిమాండ్ తగ్గడం లేదు. 

 

బాలీవుడ్ తో పాటుగా హాలీవుడ్ లో కూడా ఆమె వరుస అవకాశాలు దక్కించుకుని కెరీర్ లో దూసుకుపోతుంది. ఆ తర్వాత వచ్చిన ఎందరో హీరోయిన్లు వెళ్ళిపోయారు. అయినా సరే ప్రియాంక చోప్రా మాత్రం ఎక్కడా కూడా వెనక్కు తగ్గలేదు. ఫ్యాషన్ విషయంలో కూడా ప్రియాంకా చోప్రా ఎందరో హీరోయిన్లకు స్ఫూర్తి. నటన విషయంలో కూడా ఆమె ఎందరికో గురువు. గ్లామర్ ని నటనను సమ పాళ్ళలో చూపించింది ప్రియాంకా. నిక్ జోనాస్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత హాలీవుడ్  సినిమాల్లో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఆమె కెరీర్ పీక్ స్టేజి లో ఉంది. అవకాశాలు అటు ఇటు రావాడ౦తో ఆమె భారత ప్రభుత్వాన్ని ప్రత్యేక విమానం కూడా కోరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: