నీరజా బానోత్... దేశం గర్వించదగిన మహిళల్లో ఒకరు. ఎయిర్ హోస్టెస్ గా జీవితాన్ని ఆరంభించిన ఆమె తన విధుల్లో ప్రాణాలు కోల్పోయారు. నీర్జా బానోత్‌ 1963 సెప్టెంబరు 7న పంజాబ్‌లోని చండీగఢ్‌లో రమా భానోట్, హరీష్ భానోట్ దంపతులకు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది ఆమె. తండ్రి హిందుస్తాన్‌ టైమ్స్ లో 30 ఏళ్ల పాటు సేవలందించి తన 86వ ఏట 2008 జనవరిలో కన్నుమూశారు. 1985లో గల్ఫ్ లో పని చేసే ఓ వ్యక్తితో బానోత్‌కు వివాహమైంది. వరకట్న వేధింపుల వల్ల ఆమె కొన్ని నెలలకే పుట్టింటికి తిరిగి వచ్చేసింది. 

 

ఈ నేపథ్యంలో పాన్ అమ్‌లో విమాన సేవకురాలి (ఎయిర్‌హోస్టెస్‌)గా ఎంపికైంది. అమెరికాకు చెందిన పాన్‌ ఆమ్‌-73 విమానం 1986 సెప్టెంబరు 5న ముంబైలోని సహార్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నుండి పాకిస్తాన్‌లోని కరాచీ జిన్నా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న సమయంలో ఉదయం 5 గంటల సమయంలో అందరూ నిద్రిస్తుండగా... కరాచీలో విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసారు. అందులో ఉన్న 360 మంది ప్రయాణికులు, 19 మంది విమాన సిబ్బందిని ఉగ్రవాదులు నిర్భందించారు. 

 

అమెరికన్లే లక్ష్యంగా వచ్చిన ఉగ్రవాదులు వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన నీర్జా  ప్రయాణికుల వద్దున్న పాస్‌పోర్టులన్నింటినీ చిక్కకుండా దాచేయడంతో... దీంతో ఉగ్రవాదులు అమెరికన్లెవరో? విదేశీయులెవరో తెలుసుకోలేక... ఇబ్బంది పడ్డారు. ఈ దాదాపు 17 గంటల పాటు హైడ్రామా నడవడంతో విమానంలో బాంబులు పేల్చడానికి ఉగ్రవాదులు రెడీ అయ్యారు. గంటల కొద్దీ ఆమె ఉగ్రవాదులకు చుక్కలు చూపించింది. ఎలా అయినా సరే ప్రయాణికుల  ప్రాణాలు కాపాడాలి అనుకున్న ఆమె... 

 

అత్యవసర ద్వారం ద్వారా అందరిని పంపించాలని భావించింది. దీనిని గమనించిన ఉగ్రవాదులు, పిల్లలపై తూటాల వర్షం కురిపిస్తుండగా చిన్నారులకు అడ్డుగోడగా నిలిచి వారి ప్రాణాలను రక్షించినా ఆమె ప్రాణాలు కోల్పోయారు. వివిద దేశాలకు చెందిన 20 మంది ప్రాణాలు కోల్పోయారు. కాని వందల మందిని కాపాడింది మాత్రం నీర్జానే. (సెప్టెంబరు 5, 1986)న ఓ ఆసుపత్రిలో కన్నుమూసింది. మరణానంతరం నీర్జా ధైర్యసాహసాలకు గుర్తుగా భారత ప్రభుత్వం అశోకచక్ర అవార్డు ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: