రాజకీయాల్లో మహిళలు రాణించడం అనేది కష్టమని అంటూ ఉంటారు. ఏదైనా మద్దతు ఉంటేనే రాణించడం సాధ్యమవుతుంది. అది ఎవరు అయినా సరే... ముఖ్యంగా భారత రాజకీయాల్లో పోటీ ఎక్కువగా ఉంటుంది అనే సంగతి తెలిసిందే. అందులో నిలబడటం అనేది చాలా కష్టం. నిలబడినా గాని ఎన్నో అవమానాలను ఎదుర్కొని నిలబడ్డారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధి. ప్రేమించిన వాడి కోసం దేశానికి  వచ్చిన సోనియా గాంధి ఇద్దరు పిల్లలను పెంచుతూనే గాంధీ కుటుంబానికి ఆమె పెద్ద దిక్కు అయ్యారు. ముందు ఉండి నడిపించారు కుటుంబాన్ని. 

 

రాజీవ్ గాంధీ మరణం తర్వాత కాంగ్రెస్ బాధ్యతలను మోయడానికి ఎవరూ ముందుకి రావాలి నే ప్రశ్నకు సమాధానం చెప్పారు సోనియా గాంధీ. అప్పటి కాంగ్రెస్ సీనియర్లు ప్రణబ్ ముఖర్జీ, పీవీ నరసింహారావు ఆమెను ముందు ఉండి నడిపించారు. తొలి రోజుల్లో ఎంతో ఇబ్బంది పడిన సోనియా గాంధీ ఆ తర్వాత చాలా కష్టాలు పడ్డారు. కాని నిలబడి పార్టీని బ్రతికించారు. మన దేశానికి చెందిన వ్యక్తి కాదని ఆమె మీద అనేక నిందలు వేసారు. పార్టీ అప్పటి నుంచి మూడు సార్లు అధికారంలోకి వచ్చినా సరే ఆమె మాత్రం ప్రధాని బాధ్యతలను చేపట్టలేదు. 

 

ఆమె ప్రధాని అవ్వడానికి కాంగ్రెస్ పెద్దలు కూడా అంగీకరించలేదు. అయినా సరే పార్టీని ముందు ఉండి నడిపిస్తూనే ప్రభుత్వంలో ఏ బాధ్యత ఆమె చేపట్టలేదు. ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకి నడిపించారు. విపక్షాలు ఆమె వ్యక్తిత్వాన్ని చంపేశారు ఒకానొక సందర్భంలో. సోనియా గాంధిని ఒక వ్యభిచారిగా చూపించారు కొందరు ప్రాంతీయ పార్టీల నేతలు. కాంగ్రెస్ సీనియర్లు కూడా ఆమెను అదే విధంగా అవమానించారు. అయినా సరే సోనియా వెనక్కు తగ్గలేదు. కాంగ్రెస్ ని తన ఆలోచనలతో ఆమె బ్రతికించారు. కాంగ్రెస్ నేడు ఇబ్బందులు పడుతున్నా సరే ఆమె మాత్రం పార్టీని నిలబెడతారు అంటూ పలువురు నమ్మారు.

మరింత సమాచారం తెలుసుకోండి: