దేశ రాజకీయాల్లో జయలలిత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తమిళనాట ముఖ్యమంత్రిగా ఉండి కూడా జాతీయ రాజకీయాల్లో కూడా ఆమె చక్రం తిప్పారు. తన శక్తి సామర్ధ్యాలతో ఆమె కర్ణాటకలో పుట్టినా సరే తమిళనాడు కి అమ్మ అయ్యారు. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఎంజి ఆర్ మరణం తర్వాత జయలలిత పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అక్కడి నుంచి ఆమె పడిన కష్టాల గురించి పుస్తకాలు కూడా రాసారు ఆమె అభిమానులు. తమిళనాడు బ్రాహ్మణ సమాజం మీద ఒక అభిప్రాయం ఉంటుంది. 

 

వారిని అక్కడ కొన్ని కులాలు తీవ్రంగా ద్వేషిస్తాయి. అయినా సరే ఆమె అదే తమిళనాడు నెత్తి మీద కూర్చున్నారు. 90 లలో ఆమె చీరని డిఎంకే లాగడం ఆ తర్వాత ఆమె అన్నాడిఎంకే ని పూర్తి స్థాయిలో హస్తగతం చేసుకోవడం జరిగాయి. తన చీరను వాళ్ళు లాగినప్పుడు ముఖ్యమంత్రిగానే సభలో అడుగు పెడతా అని సవాల్ చేసారు జయలలిత. అదే విధంగా ఆమె ముందుకి వెళ్ళారు. ఏళ్ళ తరబడి కీలక పదవులు అనుభవించి రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకులకు చుక్కలు చూపించారు. తనను చీర లాగి అవమానించిన వారి మీద అదే స్థాయిలో ప్రతీకారం తీర్చుకున్నారు. 

 

కరుణానిధి ని ఎదురుపడి కూడా చూడలేదు ఆమె. తన మీద అవినీతి ఆరోపణలు వస్తే, తన ఒంటి మీద బంగారం మొత్తం తీసేసి... అవినీతి ఆరోపణలు లేని రోజే ఆ బంగారం తాను ధరిస్తా అన్నారు. పట్టుదలగా ముఖ్యమంత్రి అయి అదే పట్టుదలగా పాలించారు. తమిళనాట ముఖ్యమంత్రిగా ఆమె తీసుకొచ్చిన సంస్కరణలు చూసి దేశం కూడా ఆశ్చర్యానికి గురైంది. దేశంలో మహిళా శక్తి గురించి మాట్లాడితే ప్రధానంగా మాట్లాడేది జయలలిత గురించే. ఆ విధంగా ఆమె రాజకీయాల్లో తిరుగులేని ముద్ర వేసారు. తమిళనాడు రాజకీయాలు అంటే జయలలిత, జయలలిత అంటే తమిళనాడు రాజకీయాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: