దేశంలో ఇప్పుడు అత్యంత శక్తివంతులు ఎవరూ అంటే ప్రధానంగా వినపడే పేర్లు ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా. దేశ రాజకీయాలను ఈ ఇద్దరు దాదాపు ఆరేళ్ళు గా శాసిస్తునే ఉన్నారు. తల వంచిన వారికి ఒక న్యాయం ఎదురు తిరిగిన వారికి మరో న్యాయం, వారి మాట వినని వారికి మరో న్యాయం ఇలా ఉంటుంది వాళ్ళ స్టైల్. అడ్డు చెప్పే వాడు లేడు అడ్డు చెప్తే ఎం జరుగుతుందో చాలా మంది ప్రముఖులు చూసారు. వాళ్లకు ఎదురు తిరిగి అధికారాలు కూడా కోల్పోయారు దేశంలో. 

 

అలాంటి వారికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ చుక్కలు చూపిస్తున్నారు. తనను గద్దె దించి బెంగాల్ కోట మీద బిజెపి జెండా ఎగురవేయాలని భావిస్తున్న వాళ్లకు ఆమె బెంగాల్ లో నానా ఇబ్బందులు పెడుతున్నారు. బెంగాల్ అనేది కమ్యునిస్ట్ ల కంచుకోట. అలాంటి బెంగాల్ కోట ను కూల్చి మావోయిస్ట్ ల సహకారం తో ఆమె అధికారంలోకి వచ్చారు. గత ఎన్నికల్లో బెంగాల్ శాసన సభలో 60 శాతం పైగా స్థానాలు గెలిచారు. బెంగాల్ గర్వంగా చెప్పుకుంటారు మమతా బెనర్జీని. 

 

పార్లమెంట్ ఎన్నికలకు ముందు బెంగాల్ లో ఎక్కువ ఎంపీ స్థానాలు గెలవాలని ఆమె మీద కుట్ర రాజకీయాలు చేసారు కొందరు. వాటిని సమర్ధవంతంగా తిప్పి కొట్టారు మమత 17 ఎంపీ స్థానాలను బిజెపి గెలిచింది. ఇక బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉండే భారత సైన్యం బెంగాల్ గ్రామాల్లోకి అడుగుపెట్టాలని చూస్తుంటే ఆమె వారికి మొహం మీదే వార్నింగ్ ఇచ్చారు. శాంతి భద్రతలు అనేవి రాష్ట్రాల పరిధిలోని అంశం అని స్పష్టంగా చెప్పారు. బెంగాల్ లో అడుగుపెట్టే అధికారం సైన్యానికి లేదని ఘాటుగానే చెప్పారు మమత. మోడీ షా వ్యూహాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారు. బెంగాల్ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆమె లోటు చేయడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: