ఉత్తరప్రదేశ్... 80 పార్లమెంట్ స్థానాలు, 400కి పైగా అసెంబ్లీ స్థానాలు... దేశ రాజకీయాలను తన కనుసైగలతో శాసించే రాష్ట్రం అది. ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయితే దేశంలో సగం పట్టు ఉంటుంది. అక్కడ మెజారిటి స్థానాలు పార్లమెంట్ కి సాధిస్తే తిరుగు ఉండదు. ఆ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. కాంగ్రెస్ అయినా, బిజెపి అయినా, ప్రాంతీయ పార్టీ అయినా సరే అక్కడ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించి అధికారంలోకి వచ్చినవే. బిజెపి 2014 లో అధికారంలోకి వచ్చింది అంటే అక్కడ మెజారిటి స్థానాలే. అలాంటి రాష్ట్రాన్ని ఒక దళిత మహిళ శాసించింది. 

 

నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయింది... ఆమే... మాయావతి. తండ్రి చిన్న ఉద్యోగి... తల్లి ఇంట్లోనే ఉండే వారు. చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆమె దేశ రాజకీయాలను కూడా శాసించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో దళిత ఓటు బ్యాంకు ఎక్కువ. అణగారిన వర్గాలు కూడా ఎక్కువగానే ఉంటాయి అక్కడ. దళితుల పై అరాచకాలు కూడా ఎక్కువే. అలా ప్రజల్లోకి వెళ్లి అగ్ర వర్ణాలను కూడా తన వైపుకి తిప్పుకున్నారు మాయావతి. తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. తన ప్రత్యర్ధులు అయిన సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్...

 

మాజీ ప్రధాని వాజ్ పేయిని సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు ఆమె. 2004 లో బిజెపి ఓటమిని ఆమె శాసించారు. ములాయ౦ సింగ్ యాదవ్ ని ఆమె ముందు నుంచి వ్యతిరేకిస్తూ ఉండే వారు. ఆమెకు ఉన్న ఓటు బ్యాంకు తెలిసిన కాంగ్రెస్ పార్టీ ఆమె మీద ఆచితూచి విమర్శలు చేస్తూ ఉండేది. రాజకీయంగా నేడు ఆమె బలహీనంగా ఉన్నా... దళితులకు రాజ్యాధికారం అనే విషయంలో ముందు అడుగు వేసిన మహిళ ఆమె. అలా దేశాన్ని శాసించే రాష్ట్రాన్ని పాలించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన పార్టీ బహుజన్ సమాజ్ వాదీ పార్టీ ద్వారా ఆమె చరిత్ర సృష్టించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: