పూలన్ దేవి... ఈ తరానికి ఈమె గురించి పెద్దగా పరిచయం లేకపోయినా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ప్రజలకు, రాజస్థాన్ ప్రజలకు ఈమె ఎప్పటికి గుర్తు ఉంటారు. దేశ రాజకీయాల మీద, పోరాటాల మీద కనీస అవగాహన ఉన్నా సరే ఈమె గురించి తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పంబల్ లోయలో బందిపోటు రాణి గా పేరు తెచ్చుకున్న పూలన్ దేవి ఎందరో పేదల పక్షాన నిలిచిన ధీర వనిత. రాజకీయ నాయకులు అయినా సరే ఆమె పేరు వింటే అప్పట్లో భయపడిపోయే వారు. 

 

దళిత మహిళగా పుట్టినా అన్ని వర్గాల పేదలకు ఆమె దగ్గరి మనిషి అయ్యారు. చిన్న వయసులోనే తండ్రి వయసు ఉన్న వ్యక్తితో వివాహం లైంగిక హింస, దోపిడీ వంటి వాటిని తన చిన్న వయసులోనే చూసింది. జీవితంలో ఏమీ తెలియకపోయినా సరే నానా కష్టాలు పడింది. బందిపోటు రాణి గా ఉన్న వారి దగ్గర దోచి లేని వారికి పెట్టింది. తనను హింసించిన వారికి చుక్కలు చూపించింది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు, ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ధీరత్వం ఆమె సొంతం. ఎక్కడ అయినా ఎవరు అయినా కష్టాల్లో ఉంటే చాలు ఆమె వంతు సహాయ౦ అందేది. 

 

బెహమాయి అనే ప్రాంతంలో ఆమె తీర్చుకున్న కక్ష సాధింపు అప్పట్లో ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీ కి కూడా చుక్కలు చూపించింది. ఆమెను పట్టుకోవడానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేసినా చివరికి లాభం లేక ఆమెతో రాజీకి వచ్చారు. ఆమెను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఎంపీ సీటు ఇచ్చారు. బంపర్ మెజారిటి తో విజయం సాధించి పార్లమెంట్ కి అడుగు పెట్టింది. అయినా సరే ఆమెను ప్రాణ గండం వదిలిపెట్టలేదు. ఢిల్లీ లో హత్యకు గురయ్యారు పూలన్ దేవి. అయినా పేదలు ఆమెను ఇప్పటికీ కొలుస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: