తుల‌సి క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించిన న‌టి. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మై ఎన్నో చిత్రాల్లో న‌టించింది తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. అంతేకాక హీరోయిన్‌గా కొన్ని చిత్రాల్లో న‌టించింది. వాళ్ళ‌ అమ్మాగారి సొంతిల్లు తాడేపల్లి గూడెం కాని త‌ను పుట్టిపెరిగిందంతా చెన్నైలో. వాళ్ళ త‌ల్లిదండ్రులు బాగా శ్రీ‌మంతుల కుటుంబ‌మ‌ట‌. అయితే వాళ్ళ అమ్మ‌గారికి సినిమాల్లో న‌టించాల‌ని ఉండేదంట‌. అప్ప‌టికే సినిమా ఫీల్డ్‌లో ఆమెకి తెలిసిన‌వాళ్ళు ఉన్నారు. 

 

అమ్మ సినిమాల  అవకాశాల కోసం చెన్నై వెళ్లి, అక్కడ ఇల్లు కూడా కొనేసింది. మొదటి నుంచి కూడా ఆమెకు అంద‌రికి దాన‌ధ‌ర్మాలు చెయ్య‌డం ఎక్కువ‌గా చేసేది. అప్పట్లో మా ఇంట్లో పని చేసేవారికి కూడా ఆమె ప్ర‌తి ఒక్క‌రికి  ఇళ్ళు క‌ట్టించి ఇచ్చింది. అంటే దాదాపు ఏడుగురికి ఇళ్లు  కట్టించి ఇచ్చింది.  

 

మ‌న‌కు డ‌బ్బులు ఎంత అవ‌స‌ర‌మో అంతే ఉండాల‌ని అంత‌కు మించి ఉండ‌కూడ‌ద‌ని చెప్పేది. కుద‌రితే నువు కూడా దానాలు చెయ్య‌డం మొద‌లు పెట్టు నీకే చాలా మంచిది అని చెప్పేది. ఆమె చేసిన పుణ్యం వల్లనే ఈ రోజున నేను ఈ స్థాయిలో వున్నాను" అని  తులసి వాళ్ళ అమ్మ‌గారికి గురించి ఎంతో ఆవేద‌న‌తో చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: