మహిళలు మామూలు సమయాల్లో కంటే గర్భ సమయంలో జాగ్రత్తగా ఉండాల‌న్న విష‌యం అంద‌రికి తెలుసు. మ‌రియు ఆరోగ్యమైన శిశువు కొరకు అన్ని కలిసిన పౌస్టికాహారము అనగా ఎక్కువపాలు, పండ్లు, ఆకుకూరలు, పప్పు, మాంసము, చేపలు వగైరా ఖ‌చ్చితంగా తీసుకోవాలి. గర్భం దాల్చడం, బిడ్డకు జన్మనివ్వడం అనేది మహిళలకు దేవుడిచ్చిన గొప్ప వరం. ఇక గ‌ర్భ‌వ‌తులకు  ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతుంటారు. అయితే ముఖ్యంగా కొన్ని విష‌యాలు గ‌ర్భ‌వ‌తుల‌కు అస్స‌లు చెప్ప‌కూడ‌దు. మ‌రి అవేంటో ఓ లుక్కేసేయండి.

 

గర్భం దాల్చిన నెలలు గడిచేకొద్దీ బిడ్డ సైజు పరిమాణం వలన కొందరిలో కడుపు చూడటానికి పెద్దదిగా చిన్నదిగా ఉండటం సాధారణం. అందుకని ఏంటి ఇన్ని నెలలు గడుస్తున్నా ఇంకా కడుపు చిన్నదిగా ఉంది అని వారిని బాధపెట్టే విష‌యాలు వారితో చ‌ర్చించ కూడ‌దు. బయట ఎక్కడో జరిగిన ప్రమాదకర విషయాలు,  భయపెట్టే విషయాలు, చావు వార్తలు వంటివి గ‌ర్భ‌వ‌తుల‌కు చెప్ప‌కూడ‌దు. అలా చెప్ప‌డం వ‌ల్ల వాళ్ల‌కు తెలియకుండానే అదే ఆలోచనలతో ఉంటారు. అది పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపెడుతుంది.

 

అలాగే గర్భంతో ఉన్న‌ప్పుడు పక్కవాళ్ళు, సహోద్యుగులు నేను మీ కడుపును తాకవచ్చా? అని చేతులు వేస్తుంటారు. ఇలా చేయడం మంచిది కాదు. బిడ్డకు తల్లి స్పర్శే అత్యంత ఆనందాన్ని ఇస్తుంది. గర్భంతో ఉన్నప్పుడు ఎప్పుడు బిడ్డను కంటావు, ఎలా బిడ్డకు జన్మనిస్తావు, నార్మల్ డెలివరీ ప్లాన్ చేసుకున్నారా? లేక సిజేరియన్ ప్లాన్ చేసుకున్నారా? అనేవిధంగా వారితో అనటం వలన ఒత్తిడి, భయాందోళనలకు గురయ్యే అవ‌కాశాలు ఎక్క‌వ‌గా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: