ప్రెగ్నన్సీ అనేది.. చాలా మ‌ధుర‌మైన‌ అనుభవాన్ని అందిస్తుంది. ఆ టైమ్‌లో పెయిన్, గెయిన్ రెండింటితోనే మ‌హిళ డీల్ చేయగలగాలి. ప్రస్తుత కాలంలో చాలా మంది మహిళలు.. సాధారణ డెలివరీ కంటే.. సిజేరియన్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం డెలివరీ అంటే అంటే ఆపరేషన్ జరగాల్సిందే. కోతలు లేకుండా అసలు ప్రసవం కావాట్లేదు. మునుపటి కాలంలో చాలా వరకూ సాధారణ ప్రసవాలు అయ్యేవి. అయితే ఇటీవ‌ల గర్భం పొందిన మహిళలు.. లేబర్ పెయిన్ గురించి ఆలోచించడం కూడా చాలా కష్టమే.

 

ముఖ్యంగా మొదటిసారి ప్రెగ్నంట్స్ అయిన మహిళలకు ఈ టెన్షన్ మరింత ఎక్కువగా ఉంటుంది. కానీ, గ‌ర్భంతో ఉన్న‌ప్పుడు కొన్ని ప‌నులు చేస్తే మాత్రం సులువుగా నార్మ‌ల్ డెలివ‌రీ అవుతుంది. గర్భం సమయంలో సరైన పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా గ్రీన్ వెజిటేబుల్, ప్రోటీన్స్, విటమిన్స్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది. గర్భంతో ఉన్నప్పుడు ఎక్కువగా పడుకోవాలని, నిద్రించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది.

 

అయితే ఎప్పుడు నిద్రతోనే కాకుండా వ్యాయామాలు చేయడం, అటు ఇటు ఇంటి వద్దనైనా నడవడం, స్విమింగ్ చేయడం చేయాలి. ఇలా చేయడం వలన నార్మల్ డెలివరీ జరగడానికి ఉపయోగపడుతుంది. అలాగే శ్వాస పీల్చుకోవడం.. ఇది అందరికీ కాస్త ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ సహజ కాన్పు జరగడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇత‌రుల మాట‌లు అంటే.. బిడ్డ కనడం అంత సులువు కాదు, నువ్వు బిడ్డను కనలేవు ఇలాంటి నిరుత్సాహప‌రిచే వాటికి అస్స‌ల భ‌య‌ప‌డ‌కండి.

మరింత సమాచారం తెలుసుకోండి: