టాలీవుడ్ లో విప్లవ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ టి కృష్ణ తర్వాత మాదాల రంగారావు.  ఆయన తీసిన విప్ల సినిమాలు ప్రజల్లో ఎంతో చైతన్యం తెచ్చ విధంగా ఉండేవి అంటారు.   అవినీతి, అణిచివేత లాంటి సామాజిక సమస్యలను ప్రతిబింబిస్తూ అనేక సినిమాలు రూపొందించాడు. నవతరం ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థ స్థాపించాడు. మరో కురుక్షేత్రం, యువతరం కదిలింది, ఎర్రమల్లెలు, విప్లవశంఖం, నవోదయం, మహాప్రస్థానం, తొలిపొద్దు, ప్రజాశక్తి, బలిపీఠంపై భారతనారి, ఎర్రపావురాలు, స్వరాజ్యం, జనం మనం వంటి సినిమాల్లో నటించారు. నాంపల్లి స్టేషన్ కాడా రాజా లింగో, కాలేజీ కుర్రవాడ కులాసాగా తిరిగేటోడా, అమరవీరులెందరో అనే పాటలు ఎంతో పాపులర్ అయ్యాయి.

 

తాను నిర్మించిన చిత్రాల ద్వారా వచ్చిన లాభాన్ని సీపీఎం పార్టీ కార్యాలయానికి విరాళంగా ఇచ్చేవాడు.  ఆయన తనయుడు మాదాల రవి కొన్ని సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన తండ్రి మాదాల రంగారావు నటించిన సినిమాలను గురించి ప్రస్తావించారు. "అప్పట్లో నాన్నగారు చేసిన 'యువతరం కదిలింది' సినిమా విప్లవ సినిమాలకి ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. 'ఎర్రమల్లెలు' ఆయన స్థాయిని పెంచింది. వామ పక్ష భావాలను ఈ సినిమా మరింత బలంగా నాటగలిగింది. నాన్న నటించిన సినిమాల్లో విప్ల శంఖం సూపర్ హిట్ అయ్యింది.

 

అప్పట్లో విప్లవాత్మక సినిమాలు కమర్షియల్ సినిమాలతో పోటీగా ఉండాలంటే ఎంతో సత్తా ఉండాలి. సెన్సార్ బోర్డువారు అభ్యంతరం వ్యక్తం చేసిన కొన్ని డైలాగ్స్ ను కట్ చేయడానికి నాన్నగారు నిరాకరించారు. ఈ విషయంపై ఆయన చాలాకాలం పాటు పోరాడారు. విడుదలైన ప్రతి థియేటర్లో ఈ సినిమా 100 రోజులు ఆడింది.   శ్రీశ్రీగారు, నాన్నగారు మంచి మిత్రులు. శ్రీశ్రీగారితో నాన్నగారు రాయించిన 'కొంతమంది కుర్రవాళ్లు' పాట జనంలోకి దూసుకుపోయింది" అని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: