మ‌హిళ జీవితంలో ప్రెగ్నెన్సీ అత్యంత ముఖ్యమైన, క్లిష్ట‌మైన స‌మ‌యం. మహిళ గర్భం పొందిన వెంటనే ఆహారాల మీద ఎక్కువ ఇష్టం కలిగి ఉంటారు. ఎప్పుడు తినని ఆహారాల మీద కూడా ఈ సమయంలో కోరిక పుడుతుంది. అయితే బేబీ పుట్టేముందు, పుట్టిన తర్వాత ప్రెగ్నెంట్ మహిళకు పోషక విలువలు కల శక్తివంతమైన ఆహారం తీసుకోవాలి. ఈ ఆహారం కడుపులో ఎదుగుతున్న బిడ్డకు ఆమెకు కూడా అవసరం. అలాగే గర్భిణీ , మరియు కడుపులో పెరిగే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే నేచురల్ స్వీట్ ను అందించే పండ్లు, ఇతర నేచురల్ ఫుడ్స్ తీసుకోవచ్చు.

 

కానీ, ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఇప్పుడు చెప్ప‌బోయే ఫ్రూట్స్‌కు దూరంగా ఉంటేనే మంచిది. అందులో మొద‌టిగా నల్ల ద్రాక్ష. వాస్తవానికి నల్లద్రాక్ష తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఇందులో శరీరానికి వేడి కలిగించే గుణం ఎక్కువ.  శరీర వేడి కారణంగా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. అలాగే బొప్పాయి.. సాధార‌ణంగా ఇది తిన‌కూడ‌ద‌ని అంద‌ర‌కీ తెలుసు. అయిన‌ప్ప‌టికీ బొప్పాయి తినడం వలన ఏమీ కాదని, ఆరోగ్యానికి మంచిదేనని మరికొందరు అంటుంటారు.

 

వాస్త‌వానికి ఇందులో ఉండే లేటెక్స్ అనే పదార్థం గర్భంలో సంకోచాలు కలిగించి గర్భవిచ్ఛిన్నం కావడానికి కారణమవుతుంది. మ‌రియు పైనాపిల్.. ప్రెగ్నెన్సీ టైమ్‌లో మహిళలు ప్రసవించేవరకు తినకూడని ఫ్రూట్స్‌లో ఇది కూడా ఒక‌టి. ఇందులో ఉండే బ్రొమలైన్ అనే పదార్థం గర్భాన్ని కొంచెం కొంచెంగా దూరం చేస్తుంది. ఈ పండు గర్భంతో ఉన్నపుడు తినడం వల్ల మిస్ క్యారేజ్ అవ్వ‌డ‌మో లేదా పుట్టబోయే బిడ్డ అనారోగ్యంగా పుట్టడం జరుగుతుంటుంది అని చెబుతున్నారు నిపుణులు. కాబ‌ట్టి ఈ ఫ్రూట్స్‌కు దూరంగా ఉంటేనే బెట‌ర్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: