మనం ఆవకాయ్ పచ్చడి తినే ఉంటాం.. కానీ నువ్వుల ఆవకాయ్ పచ్చడి మాత్రం ఎప్పుడు తిని ఉండము. ఎందుకంటె నువ్వుల ఆవకాయ్ పచ్చడి చేస్తారు అనేది కూడా చాలామందికి తెలియదు కాబట్టి. ఇకపోతే ఈ నేపథ్యంలోనే నువ్వుల ఆవకాయ్ పచ్చడి ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. ఇంట్లోనే పచ్చడి చేసుకొని రుచి ఆస్వాదించండి. 

 

కావాల్సిన పదార్ధాలు.. 

 

మామిడికాయ ముక్కలు - కేజీ, 

 

నువ్వులు - 250 గ్రాములు, 

 

ఉప్పు - 250 గ్రాములు, 

 

నువ్వుల నూనె - 500 గ్రాములు, 

 

అల్లం వెల్లుల్లి ముద్ద - 250 గ్రాములు, 

 

ఆవపొడి - 50 గ్రాములు, 

 

పసుపు - టేబుల్‌స్పూన్‌, 

 

జీలకర్ర పొడి - 25 గ్రాములు, 

 

మెంతిపొడి - టీస్పూన్‌, 

 

ఇంగువ - చిటికెడు, 

 

ఆవాలు, జీలకర్ర - 1/2 టీస్పూన్‌.


 
తయారీ విధానం.. 

 

మామిడికాయ ముక్కలను శుభ్రంగా కడిగి నీటి చుక్క లేకుండా నీట్ గా తుడిచి పెట్టుకోవాలి. ఆతర్వాత నువ్వులను దోరగా వేయించి మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టాలి. ఒక గిన్నెలో నువ్వుల పొడి, ఉప్పు, జీలకర్ర పొడి, మెంతిపొడి, పసుపు, ఆవపొడి వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. మరో గిన్నెలో నువ్వుల నూనె వేడి చేసి ఇంగువ వేయాలి. అది కరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక దింపేయాలి. 

 

నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి. ఈ అల్లంవెల్లుల్లి అందులోని పచ్చివాసన పోయి కమ్మగా తయారు చేస్తుంది. పూర్తిగా చల్లగా అయినా తర్వాత కలిపి ఉంచుకున్న పొడులు, మామిడికాయ ముక్కలు వేసి బాగా కలిపిపెట్టాలి. అన్ని ముక్కలకు మసాలా అంటిన తర్వాత తీసి శుభ్రమైన జాడీలోకి తీసుకుని మూతపెట్టి ఉంచాలి. 3 లేదా 4 రోజుల తర్వాత ఆవకాయ కలిపితే రుచి అద్భుతంగా ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: