గ‌ర్భం దాల్చ‌డం అనేది ప్ర‌తి మ‌హిళ జీవితంలో ఓ అపూర్వ‌మైన, అంద‌మైన ఘ‌ట్టం. మాతృత్వం స్త్రీ పునర్జన్మ లాంటిది. మ‌రియు ఇంట్లో కొత్తగా మ‌రో వ్యక్తి రాభోతున్నాడంటే ఇక ఆ ఇంట్లో మొత్తం కుటుంబ సభ్యులకు ఒక పండగ వాతావరణం ఏర్పడుతుంది. ఈ విషయం చాలా మందిని సంతోషపరుస్తుంది. ప్రతి తల్లి మంచి తెలివితేటలు, బలం మరియు మంచి ఆరోగ్యం ఉన్న తన బిడ్డ పుట్టాలని కలలు కంటుంది. అయితే మీతో పాటు మీ కడుపులో ఒక బిడ్డను మోస్తున్న మీరు, తల్లిగా ఎన్నో జాగ్రత్తలను తీసుకోవలసి ఉంటుంది.

 

ముఖ్యంగా ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో కొన్ని ఆహార జాగ్ర‌త్త‌లు ఖ‌చ్చితంగా పాటించాలి. అందులో ముఖ్యంగా మాంసం ఒకటి. సరిగ్గా ఉడకని మాంసం తీసుకోవడం, బాగా ఉడకని గుడ్లు తినటం వలన ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే బిడ్డ మిస్ క్యారేజ్ అయ్యే ఛాన్స్ లు లేకపోలేవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ప్రెగ్నన్సీ సమయంలో సీ ఫుడ్ తీసుకోవడం మంచిదనే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

 

ఎందుకంటే సీఫుడ్ లో ఎక్కువగా ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్, ఐరన్ మరియు జింక్ సమృద్ధిగా ఉండటమే కారణం. ఇవి తల్లికీ, బిడ్డకు బాగా ఉపయోగపడతాయి. అయితే సీఫుడ్ తీసుకునేట‌ప్పుడు పచ్చిగా ఉండే వాటిని, సరిగ్గా ఉడకని వాటిని అస్సలు తీసుకోకూడదు. అంతేకాకుండా మెర్క్యూరీ ఉన్నటువంటి చేపలకు దూరంగా ఉండాలి. షార్క్, టైల్ ఫిష్, స్వార్డ్ ఫిష్, కింగ్ మిల్ మేకర్ ఈ చేపలలో మెర్క్యూరీ అధిక మోతాదులో ఉంటుంది. అందుకని వీటిని తినక‌పోవ‌డ‌మే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: