ఆడవారిపై హింస అనేది ఈనాటి కాలంలోది కాదు.. ఏనాటి కాలం నుండో ఇదే కొనసాగుతుంది. ఆడపిల్ల పుట్టింది అంటే 12 ఏళ్లకే పెళ్లి చేసి పంపేవారు.. పెళ్లి కొడుకు వయసు 30. భార్యను అర్థం చేసుకునే జ్ఞానం అతనికి లేదు. భర్తకు ఆమె బాధలు చెప్పుకునేంత దైర్యం లేదు. అలాంటి సమయంలో ఆమె ఏం చెయ్యాలి ? 

 

భర్త లేని సమయంలో అత్తా కొడుతుంది.. మామ మాటలతో వేధిస్తున్నాడు.. ఉదయం నుండి రాత్రి వరుకు ఇంటి పని, వంట పని చేస్తున్న.. ఎంతో రుచిగా వండి పెడుతున్న ఉప్పు లేదు.. కారం లేదు అని ఆడబిడ్డ వేధింపులు.. తల్లితండ్రులకు చెప్తే కష్టం అయినా నష్టం అయినా నీకు అత్తిళ్ళే అమ్మ అని అంటారు.. 

 

స్నేహితులు లేరు.. తల్లితండ్రులు లేరు.. భర్తకు చెప్పే దైర్యం లేదు.. కానీ ఆమె ఇంకా బతికే ఉంది. దీనికి కారణం ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ.. ఆమె కష్టాలు అన్ని ఆమె పుట్టబోయే బిడ్డకు చెప్పాలి అనుకుంటుంది.. ఎట్టి పరిస్థితుల్లో కొడుకునే ఇవ్వాలి అని కోరుకుంటుంది. కట్నం కోసమో.. ఆమెకు సహాయంగా ఉంటాడు అనో కాదు.. 

 

ఆమె కష్టాలు ఆమె కూతురుకు కూడా రాకూడదు అని.. ఆమె అత్త ఇల్లు ఎలా ఉంటుందో అని భయపడి కూతురు మాత్రం ఇవ్వకు దేవుడా అని వేడుకుంది. దేవుడు కరుణించాడు.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. మగబిడ్డను మగాడిలానే పెంచింది.. మగాడిలా అంటే శాసించడమో.. శిక్షించడమే కాదు.. మహిళలకు గౌరవం ఇవ్వడం.. భార్యను వస్తువులా కాకుండా జాగ్రత్తగా ప్రేమను చూసుకోవడం. అతని తల్లి పడ్డ కష్టాలు మరొక స్త్రీ పడకూడదు అని ఆడవారికి సహాయంగా ఉండడం. ఆమె కష్టాలు బాధలు గోడలకే పరిమితం అవుతాయి అనుకున్న సమయంలో ఆమె బిడ్డ ఆమెకు ఒక వరం అయ్యాడు.. తల్లి బతుకుకు ఒక కారణం అయ్యాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: