అమ్మ అన్న పేరు వింటే చాలు మనసులో ఎదో తెలియని అలజడి ఆప్యాయత, అనురాగం పొంగిపొర్లుతోంది. మనకు కష్టం వచ్చినపుడు ఒళ్ళో పడుకుని ఏడవడానికి అమ్మ కావాలి , దెబ్బ తగిలినప్పుడు అరవడానికి అమ్మ కావాలి.. అన్నిటికి అమ్మే కావాలి ఎందుకంటే అమ్మ లేనిదే మనకు జన్మ అనేది లేదు. అమ్మ లేనిదే అసలు పుట్టుకే లేదు కనుక. అమ్మ గూర్చి చెప్పడానికి, రాయడానికి మాటలు చాలవు.

 

సముద్రాల్లోని నీరంతా సిరాలా  మార్చి కలాల్లో నింపినా..అమ్మ గురించి వివరించడం సాధ్యం కాదు. వెన్నెలకన్నా చల్లనిది , తేనెకన్నా తీయనిది  అమ్మ ప్రేమ. సముద్రం కన్నా లోతైనది ఈ విశ్వం తోసమానమైనది అమ్మ ప్రేమ.నవ మాసాలు తన పొత్తిళ్ళలో  మనల్ని మోసి నానాయాతన పడి మనకు జన్మనిస్తుంది . బిడ్డనేలోకంగా భావిస్తుంది . మలమూత్రాలు శుభ్రంచేస్తుంది గోరుముద్దలు తినిపిస్తుంది , లాలిస్తుంది అడుగులు వేయడం నేర్పిస్తుంది మనల్ని పెంచిపెద్ద చేస్తుంది. మనం చేసే కొంటె పనులకి నాన్నకోప్పడితే అమ్మ అడ్డువస్తుంది .

 

మనంచేసే ప్రతితప్పుని తన ప్రేమ తో సరిచేస్తుంది . ఓనమాలునేర్పుతుంది అందుకే అమ్మని తొలి గురువుఅంటారు . మనం సాధించే చిన్న చిన్నవిజయాలకు అమ్మ పొంగి పోతుంది. బిడ్డ ఎలా ఉన్నాగాని కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది.  అమ్మ లేని అనాధల జీవితం నరకం వాళ్ళ ఆలనా పాలనా చూడడానికి ఈ లోకంలో మనకి  ఎవ్వరు లేకపోయినా సరే , అమ్మ ఒక్కతి ఉంటేచాలు ప్రపంచాన్ని జయించవచ్చు. మనం విజయాన్ని సాధించితే మురిసిపోతుంది. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: