క‌రోనా వైర‌స్‌ను ఎదుర్కొనేందుకు కేర‌ళ‌కు చెందిన 24మంది మ‌హిళా డాక్ట‌ర్లు డాన్స్‌తో డాక్ట‌ర్ల‌లో మ‌నోధైర్యం నింపే ప్ర‌య‌త్నం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. క‌రోనా వైర‌స్ నుంచి ప్ర‌జ‌ల‌ను కాపాడేందుకు ప్ర‌స్తుతం డాక్ల‌ర్లంతా ప్రాణాల‌కు తెగించి విధులు నిర్వ‌ర్తిస్తున్న విష‌యం తెలిసిందే. కేర‌ళ‌లోని ఎస్ కే ఆస్ప‌త్రికి చెందిన 24 మంది మ‌హిళా డాక్ల‌ర్లు విధులు ముగించుకున్నాక లోకం ముఝువ‌న్ సుఖం ప‌క‌ర‌న్ భ‌క్తి పాట‌కు డ్యాన్స్ చేశారు. క‌రోనాతో అంత‌టా గంభీర‌, భీతావహ వాతావ‌ర‌ణం నెల‌కొన్న వేళ కాస్త మ‌న‌స్సుకు ఉల్ల‌సాన్ని, మ‌నోధైర్యాన్నిచ్చేందుకే తాము నృత్యం చేశామ‌ని డాక్ట‌ర్లు తెలిపారు. 

 

ఆస్ప‌త్రిలో అన‌స్థీటిస్ట్ డాక్ట‌ర్ శ‌ర‌ణ్య కృష్ణ‌న్ ఈ పాట‌కు నృత్య రీతుల‌ను స‌మ‌కూర్చింది. మిగిలిన బృందం అంతా ఆమెను అనుక‌రిస్తూ నృత్యాలు చేశారు. డాక్ట‌ర్ల నృత్యానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇదిలా ఉండ‌గా కేర‌ళ‌లో క‌రోనా చాలా వ‌ర‌కు అదుపులోకి వ‌చ్చింద‌ని అక్క‌డి వైద్య ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. మ‌ర‌ణాల సంఖ్య సింగిల్ డిజిట్‌లోకి రాగా. పాజిటివ్ కేసుల సంఖ్య కూడా సింగిల్ డిజిట్లోకి రావ‌డం గ‌మ‌నార్హం. ఇదిలా ఉండ‌గా లాక్‌డౌన్ ముగిసేనాటికి క‌రోనా ఫ్రీ రాష్ట్రంగా కేర‌ళ మారుతుంద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ధీమాగా చెబుతోంది. 

 

ఇక లాక్‌డౌన్ వేళ అక్క‌డి ప్ర‌భుత్వం పేద‌ల‌ను ఆదుకునేందుకు తీసుకున్న చ‌ర్య‌లపై దేశ ప్ర‌జ‌ల‌చే ప్ర‌శంస‌లు కురిపిస్తున్నాయి. ముఖ్యంగా సివిల్ స‌ప్లై శాఖ ప‌నితీరును కొనియాడుతున్నారు. ప్ర‌జ‌లు రోడ్ల‌క్క‌కుండా బ‌య‌ట‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా ప్ర‌త్యేక బృందాల ద్వారా నెల‌కు స‌రిప‌డా వ‌స్తు సామగ్రిని ప్ర‌భుత్వం తెల్ల‌రేష‌న్‌కార్డుతో నిమిత్తం లేకుండా ప్ర‌జ‌లంద‌రికీ అంద‌జేయ‌డం విశేషం. ఇక క‌రోనా క‌ట్ట‌డిలోనూ..లాక్‌డౌన్ అమ‌లులోనూ కేర‌ళ మిగ‌తా రాష్ట్రాల‌కు ఎంతో ఆద‌ర్శంగా నిలుస్తోంది. కేర‌ళ‌లో క‌రోనా నివార‌ణకు చేప‌డుతున్న చ‌ర్య‌ల‌ను కొనియాడుతూ ప‌లు అంత‌ర్జాతీయ మీడియా సంస్థ‌లు క‌థ‌నాలు ప్ర‌చురించ‌డం విశేషం. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: