గ‌ర్భం పొంద‌డం అనేది ప్ర‌తి మ‌హిళ జీవితంలో ఎంతో ఆనంద‌క‌మైన ఘ‌ట్టం అని చెప్పాలి. ఈ స‌మ‌యంలో ఎన్నో అనుభూతుల‌ను గ‌ర్భ‌వ‌తి పొందుతుంది. అయితే ఈ ప్రెగ్నెన్సీ టైమ్‌లో మ‌హిళ‌లు ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. అందులో ముఖ్య‌మైన‌ది ఆహార అల‌వాట్లు. గ‌ర్భ‌వ‌తి తీసుకునే ఆహారంపై క‌డుపులోని శిశువు ఆరోగ్యం ఆధార‌ప‌డి ఉంటుంది. ఇక చాలా మందికి ప్రెగ్నెన్సీ టైమ్‌లో అర‌టి పండు తినొచ్చా..? అన్న అనుమానాలు వ‌స్తుంటాయి. వాస్త‌వానికి అర‌టిపండు ప్రెగ్నెన్సీ మ‌హిళ‌కు ఎంతో మంచి చేస్తుంది.

 

కడుపులో పెరిగే బిడ్డకు బ్రెయిన్, నాడీవ్యవస్థ, వెన్నెముక అభివృద్ధికి ఫోలిక్ యాసిడ్ చాలా అవసరం. అరటి పండులో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది. అలాగే పోలిక్ యాసిడ్ లోపిస్తే ప్రీమెచ్యుర్ బర్త్ అవుతుంది. కాబట్టి, గ‌ర్భ‌వ‌తి ప్ర‌తిరోజు ఒక అరటి పండు తినడం వల్ల బేబి హెల్త్ కు మంచిది. ఇక మహిళ గర్భం పొందిన తర్వాత ఎదుర్కొనే సమస్యల్లో అనీమియా ఒకటి. రక్తహీనత వల్ల ప్రవసం సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. కాబట్టి, ప్ర‌తిరోజు గ‌ర్భ‌వ‌తి ఒక అర‌టి పండు తిన‌డం వ‌ల్ల ఈ సమస్యను నివారించుకోవ‌చ్చు.

 

అలాగే అరటి పండులో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా దొరుకుతాయి. ప్రెగ్నన్సీ సమయంలో అరటిపండు తినడం వల్ల ఎక్కువ కాలం మీకు క‌డుపు నిండుగా ఉంచి ఆకలి బాధలను అరికడుతుంది. అదేవిధంగా, గర్భవతికి అధిక శక్తి కావాలి. అరటిపండు అధిక శక్తినిస్తుంది. అనేక విటమిన్లు కూడా ఉంటాయి. మ‌రియు ప్ర‌తిరోజు ఒక అర‌టిపండు తిన‌డం వ‌ల్ల.. ఇందులో ఉంటే  క్యాల్షియం పుట్టే బిడ్డలో హెల్తీ బోన్ అండ్ టీత్ డెవలప్ మెంట్ కు గ్రేట్ గా సహాయపడుతుంది. అరటిపండ్లలో విటిమన్ సి కూడా పుష్కలంగా ఉంది. ఇది ఒక మంచి యాంటీఆక్సిడెంట్. దీని వ‌ల్ల తల్లిబిడ్డలో వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. కాబ‌ట్టి, ప్రెగ్నెన్సీ మ‌హిళ‌లు ప్ర‌తిరోజు ఒక అర‌టిపండును ఖ‌చ్చితంగా డైట్‌లో చేర్చుకోవాలి.

 
 
  

 

మరింత సమాచారం తెలుసుకోండి: