మ‌హిళ జీవితంలో గ‌ర్భం దాల్చ‌డం అనేక ప్ర‌త్యేక‌మైన‌ది మ‌రియు ప‌రిపూర్ణ‌మైన‌ది. ఈ స‌మ‌యంలో ఎన్నో అనుభూతుల‌ను పొందుతుంది. అయితే గర్భధారణ సమయంలో ఎన్నో అపోహలను వింటూ ఉంటాం. అలాగే వాటి గురించి ప్రెగ్నెన్సీ మ‌హిళ‌లు కూడా చాలా భయాలు ఉంటాయి. ఇక గ‌ర్భ‌ధార‌ణ టైమ్‌లో స‌ద‌రు మ‌హిళ ఆహారపు అలవాట్లు, జీవనశైలిని పూర్తిగా మార్చుకోవాలి. అయితే చాలా మంది ప్రెగ్నెన్సీ మ‌హిళ‌లు డెలివ‌రీ టైమ్‌లో కూడా చింత‌కాయ‌లు తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. మరికొంద‌రు డెల‌వ‌రీ టైమ్‌లో చింత‌కాయం తిన‌డం మంచిదేనా..? అన్న ప్ర‌శ్న‌లు కూడా చాలా మందికి వ‌స్తుంటారు.

 

దీంతో ఆ టైమ్‌లో కొంద‌రు చింత‌కాయ‌ల‌ను తినాల‌నిపించినా భ‌యంతో తిన‌కుండా వ‌దిలేస్తారు. వాస్త‌డానికి చింతకాయ‌ల్లో ఉండే విటమిన్ సి హెల్తీ న్యూట్రీషియన్. దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిదే. ఐతే విటమిన్ సి ఎక్కువగా తీసుకోవడం కూడా మంచిది కాదు. విటమిన్ సి మోతాదుకు మించి తీసుకుంటే గర్భిణీకి ప్రమాదం. మిస్కరేజ్ అయ్యే చాన్సెస్ ఎక్కువ. కాబ‌ట్టి లిమిట్‌గా తీసుకుంటే మంచిది. అలాగే చింతకాయ గర్భిణులలలో కలిగే వికారం, వాంతులు మరియు ఉదయపు అలసట వంటి వాటిని తగ్గించటంలో గొప్పగా యూజ్ అవుతుంది. అదేవిధంగా,  హైబీపీ సమస్య ఉండే ప్రెగ్నెన్సీ మ‌హిళ‌లు చింతకాయలను తీసుకుంటే మంచిది. 

 

ఇది శరీరంలో ఫ్రీరాడికల్స్ ఏర్పడకుండా తోడ్ప‌డుతుంది. క్యాన్సర్ కణాలు పెరగకుండా చూసే ఔషధ గుణాలు కూడా చింతకాయల్లో ఉంటాయి. మ‌రియు చింతకాయలు ప్రెగ్నెన్సీ మ‌హిళ‌లు తీసుకోవ‌డం వ‌ల్ల ఇందులో ఉండే విటమిన్ బి3 కడుపులోని బిడ్డ ఎదుగుదలకు ఎంతగానో స‌హాయ‌ప‌డ‌తాయి. అంతేకాకుండా.. బిడ్డ మెదడు, జీర్ణవ్యవస్థ, మ్యూకస్ తదితర అవయవాలు సరిగ్గా పెరిగేలా చేయ‌డంతో చింత‌కాయ‌లు బాగా యూజ్ అవుతాయి. ఇక చింతకాయల్లో ఉండే డైటరీ ఫైబర్ మలబద్దకాన్ని త‌గ్గిస్తుంది. కాబ‌ట్టి ప్రెగ్నెన్సీ మ‌హిళ‌లు లిమిట్‌గా చింత‌కాయులు తీసుకుంటే ఎలాంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు.

మరింత సమాచారం తెలుసుకోండి: