అమ్మ అవ్వాల‌న్న కోరిక ప్ర‌తి ఒక్క‌రిలోనూ ఉంటుంది. ప్ర‌తి స్త్రీ అమ్మ అవ‌డం ఒక వ‌రంలా ఫీల‌వుతారు. పెళ్ళి అవుతుందో లేదో ఏ మ‌హిళ అయినా ఎదురు చూసేది అమ్మ అన్న పిలుపు కోస‌మే. ఆ అనుభూతిని ఎప్పుడెప్పుడు పొందుదామా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక కొంత మంది మ‌హిళ‌ల‌కైతే వాళ్ళు గ‌ర్భ‌వ‌తులో కాదో ఎలా తెలుసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటారు. దానికి సంబంధించిన కొన్ని చిట్కాల‌ను ఇప్పుడు మ‌నం ఇక్క‌డ చూద్దాం...

 

ప్రెగ్నెన్సీ వ‌చ్చిందో, లేదో తెలుసుకోవాలంటే...టెన్నాల‌జీ పెరిగాక ఎన్నో ర‌కాల ప‌ద్ధ‌తులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్నిఇంట్లో చేసే ప‌ద్ధ‌తులు ఉంటే...మ‌రికొన్ని ప‌రీక్ష‌లు హాస్పిట‌ల్స్ లో చేయాల్సి ఉంటుంది.   అయితే ఎలాంటి ప‌రీక్ష చేయ‌కుండానే మ‌హిళ‌లు త‌మ‌కు గ‌ర్భం వ‌చ్చిందో, రాలేదో సుల‌భంగా ఎలా తెలుసుకోఆలంటే... అందుకు వారి శ‌రీరంలో క‌నిపించే కొన్ని ల‌క్ష‌ణాలే కార‌ణం. ఆ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే చాలు గ‌ర్భం వ‌చ్చింద‌ని ఈజీగా చెప్పొచ్చు.

 

ముందుగా గ‌ర్భం దాల్చారంటే మ‌హిళ‌ల్లో క‌నిపించే మార్పుల్లో మొద‌టిగా తేడా వ‌చ్చేది వారి వక్షోజాలు మృదువుగా, ఉబ్బిన‌ట్టు మారుతాయి. నిపుల్స్ చుట్టూ ఉన్న ప్ర‌దేశం వెడ‌ల్పుగా, న‌ల్ల‌గా మారుతుంది. ఇలా అవుతుందంటే చాలు ఆ మ‌హిళ‌ల‌కు ప్రెగ్నెన్సీ వ‌చ్చిన‌ట్టే లెక్క‌. బిడ్డ‌కు పాలివ్వ‌డం కోసం త‌ల్లి వ‌క్షోజాల పై ఆ విధ‌మైన  మార్పు క‌నిపిస్తుంది. దాన్ని బ‌ట్టే ప్రెగ్నెన్సీ వ‌చ్చింద‌ని చెప్ప‌వ‌చ్చు.

 

కొంత‌మంది  గ‌ర్భం దాల్చిన మ‌హిళ‌లు త‌ర‌చూ మూత్రానికి వెళ్లాల్సి వ‌స్తుంది. ఎందుకంటే పిండం ఏర్ప‌డుతుండ‌డం వ‌ల్ల గ‌ర్భాశ‌యం మూత్రాశ‌యంపై ఒత్తిడి క‌లిగిస్తుంది. అందుకే త‌ర‌చూ మూత్రం వస్తుంది. ఈ ల‌క్షణం వ‌ల్ల కూడా క‌నిపెట్ట‌వ‌చ్చు.  అయితే షుగ‌ర్ స‌మ‌స్య ఉన్నా అలా త‌ర‌చూ మూత్రానికి వెళ్లాల్సి రావ‌చ్చు. అందుక‌ని ఇలాంటి ప‌రిస్థితి వ‌స్తే చెక‌ప్ చేయించుకోవ‌డం బెట‌ర్. అలాగే గ‌ర్భం దాల్చిన  మ‌హిళ‌ల్లో అల‌స‌ట ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. ఎందుకంటే వారిలో ఉండే శ‌క్తి న‌శిస్తుంది. అందుకు కార‌ణం ఎదుగుతున్న పిండ‌మే. దానికి త‌గినట్టుగా ఆహారం తీసుకుంటే ఈ స‌మ‌స్య రాదు. ఈ ల‌క్ష‌ణం ఉందంటే గ‌ర్భం దాల్చిన‌ట్టే అని చెప్ప‌వ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: