గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలోని ఓ గ్రామంలో ఓ దుర్మార్గుడు బాలిక‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. గురువారం మధ్యాహ్నం బాలిక ఇంట్లో ఒంట‌రిగా ఉన్న స‌మ‌యంలో కామాంధుడు అత్యాచారానికి ఒడిగ‌ట్టాడు. బాలిక తండ్రి మూడేళ్ల క్రితం మ‌ర‌ణించాడు. దీంతో త‌ల్లి ముగ్గురు కుమార్తెలు, కుమారుడిని పోషించుకునేందుకు చాలా క‌ష్ట‌ప‌డుతోంది. లాక్‌డౌన్ అమ‌లులో ఉన్నా గ్రామంలోని మిర్చి ప‌నుల‌కు వెళ్తూ బిడ్డ‌ల క‌డుపు నింపుతోంది. అయితే ఎప్ప‌టిలాగే స‌ద‌రు త‌ల్లి త‌న పిల్ల‌ల‌ను తీసుకుని వ్య‌వ‌సాయ కూలీ ప‌నుల‌కు వెళ్లింది. బాలిక‌కు ఒంట్లో బాగోలేక‌పోవ‌డంతో ఇంటి వ‌ద్ద‌నే ఉంది. 

 

ఇది గ‌మ‌నించిన మ‌రియానందం బాలిక ఇంట్లో ఒంట‌రిగా ఉన్న స‌మయంలో అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నకరికల్లు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు మరియానందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బాలికను వైద్య పరీక్షల కోసం నరసరావుపేట ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. ఇదిలా ఉండ‌గా తెలంగాణ రాష్ట్రం  భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా మ‌ణుగూరు మండ‌ల‌కేంద్రంలో శుక్ర‌వారం 11 ఏళ్ల మూగ బాలిక‌పై స్థానికంగా వాచ్‌మెన్‌గా ప‌నిచేస్తున్న ఓ వ్య‌క్తి అత్యాచార‌య‌త్నానికి పాల్ప‌డ్డాడు. బాలిక బంధువుల ఫిర్యాదు మేర‌కు  నిందితుడిపై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు  శంక‌ర్ తెలిపారు.

 

లాక్‌డౌన్ కార‌ణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రైం రేటు ప‌డిపోయింద‌ని తెలుస్తున్న నేప‌థ్యంలో ఇలా అత్యాచార సంఘ‌ట‌నల సంఖ్య మాత్రం పెరుగుతుండ‌టం గ‌మ‌నార్హం. అలాగే గృహ‌హింస పెరుగుతున్న‌ట్లుగా కూడా పోలీస్ అధికారులు చెబుతున్నారు. లాక్‌డౌన్ సుదీర్ఘ‌కాలంగా అమ‌లులో ఉండ‌టంతో మ‌హిళ‌లు భ‌ర్త‌ల చేతిలో ఎక్కువ‌గా వేధింపుల‌కు గుర‌వుతున్న‌ట్లుగా ఫిర్యాదులు అందుతున్నాయ‌ని పోలీస్‌శాఖ అధికారులు వెల్ల‌డిస్తున్నారు. అయితే గ‌తంలో ఎక్కువ‌గా జ‌రిగే రోడ్డు ప్ర‌మాదాలు, హ‌త్య‌లు, దోపిడీ నేరాల‌ సంఖ్య మాత్రం గ‌ణ‌నీయంగా త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్లుగా చెబుతున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: