తులసి చెట్టు ఇంటిముందు ఉంటే చాలా మంచిదని అందరు భావిస్తారు. నిత్యం లక్ష్మి దేవి స్వరూపంలా భావించి ఆడవాళ్లు పూజలు కూడా చేస్తారు. తులసి చెట్టు గాలి పీల్చితే చాలు సర్వరోగాలు నయం అవుతాయి. అలాగే మన ఇంట్లో పెరిగే తులసి వల్ల ఆడవాళ్ళకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అని తెలుసా మీకు... ఎండు తులసి ఆకు పొడిని పౌడర్‌లా రోజూ ముఖానికి పట్టిస్తే ముఖం సౌందర్యవంతంగా, కాంతివంతంగా మారుతుంది. ఈ పొడి ముఖం మీద ఉండే పలుచనివే కాదు గాఢమైన మచ్చల్ని కూడా తొలగిస్తుంది.

 

రోజూ కొన్ని తులసి ఆకుల్ని తినడం వల్ల రక్త శుద్ధి అవుతుంది. అలాగే తులసి పొడికి కొన్ని నీటి చుక్కలు కలిపిగానీ, పచ్చి తులసి ఆకులను నూరి ఆ పేస్ట్‌ని ముఖానికి పట్టిస్తే అతి సూక్ష్మమైన మలినాలు సైతం తొలగిపోయి ముఖం సహజ లావణ్యాన్ని సంతరించుకుంటుంది.

 

-ఏదైనా పాత్రలో కాసిని మంచి నీళ్లు తీసుకుని అందులో సగం నిమ్మకాయ రసాన్ని పిండాలి. అందులో ఓ పిడికెడు తులసి ఆకులు, పిడికెడు మెంతి ఆకులు వేసి కాసేపు మరగించాలి. జుట్టును టవల్‌తో కట్టేసుకుని ముఖానికి మాత్రమే ఆ ఆవిరి పట్టాలి. కొన్ని నిమిషాల తరువాత చన్నీళ్లతో ముఖం కడిగేసుకుంటే ముఖం తాజాగా మెరిసిపోతుంది.

 

ముఖం మీద నల్లటి మచ్చలు ఉన్నవారు నిమ్మరసం లేదా అల్లం రసం కలిపిన తులసి పేస్టును ముఖానికి పట్టించి అది ఎండిపోయే దాకా అలాగే ఉంచాలి. ఇలా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం చేస్తే మచ్చలు తొలగిపోవడంతో పాటు ముఖం కాంతి వంతంగా మారుతుంది. 

 

తులసి ఆకులను తీసుకొని బాగా మెత్తగా చూర్ణంలా తయారు చేసుకోండి. అందులో కాస్త పాలమీగడ, కాస్త పసుపు కలుపుకోవాలి. ఆ పేస్ట్ ను మోచేతులకు పట్టించండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే కచ్చితంగా నలుపు పోతుంది. నిమ్మకాయను కోసి ఆ ముక్కతో మోచేతులకు స్మూత్ గా మసాజ్ చెయ్యాలి. ఆ మిశ్రమంతో నల్లగా ఉన్న ప్రాంతంలో రాసుకుంటూ ఉండండి. ఇలా చెయ్యడం వాళ్ళ నలుపు క్రమంగా తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: