గర్భీణీ  స్త్రీలకు ముఖ్యంగా హిమోగ్లోబిన్ అధికంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు .మన దేశంలో చాలా మంది  మహిళలు గర్భిణీ సమయంలో రక్తహీనత వల్ల చనిపోతున్నారు.  అలాగే పుట్టే బిడ్డకి కూడా రక్తం తక్కువ ఉంటుంది. డెలివరీ సమయంలో రక్తం పోతుంది. అందుకే ఎవరైతే  రక్తహీనతతో బాధపడుతుంటారో.... అటువంటి వారు తమ రోజువారీ ఆహారంలో సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే రక్తహీనత పోయి శిశువు ఆరోగ్యంగా ఉంటాడు. మరి ఏమి ఆహారం తీసుకుంటే మంచిదో చూద్దాం ..

 

గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా కాఫీలు తాగకూడదు పాలు మాత్రం భోజనానికి టిఫిన్ కి మధ్యనున్న సమయంలో తీసుకోవాలి.అరటి పండు అధిక శక్తిని ఇస్తుంది..గర్భిణీ స్త్రీలకు రక్తహీనతను తగ్గిస్తుంది.నట్స్ అన్నిటికంటే ముఖ్యమైనది. మహిళలు తమ రోజువారీ ఆహారంలో తీసుకుంటే చాలా మంచిది. అదే విధంగా ఖర్జూరం రోజుకి రెండు మనం తినే ఆహారంలో తీసుకుంటే హిమోగ్లోబిన్ సమస్యలను అరికడుతుంది..ఓట్స్ ని తెల్లవారుజామునే ఫలహారంగా తీసుకుంటే చాలా ఉంది మంచిది..గర్భధారణ సమయంలో ఓట్ మీల్ బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం వల్ల రక్తహీనతతో పోరాడుతుంది. ఓట్ మీల్ చాలా సులభంగా జీర్ణం అయ్యే ఆహారం. అంతే కాదు ఇందులో గర్భిణీ స్త్రీకి అవసరం అయ్యే పోషకాలు మరియు ఐరన్ పుష్కలంగా ఉంటుంది.

 

 

ఆకుకూరలలో  విటమిన్స్,  ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి... అందువల్ల రోజువారీ ఆహారంలో ఆకుకూరలు తీసుకుంటే చాలా మంచిది .అలసట రాకుండా నివారిస్తుంది .అలాగే పండ్లు కూడా తీసుకుంటే మంచిది.  ఎనీమియా సమస్యతో బాధపడుతున్న వారికి దానిమ్మకాయ తీసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది.గుడ్డు, చిరుధాన్యాలు, చాప, తేనె ,పప్పు ధాన్యాలు తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గుతుంది.కమలకాయ ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల  విటమిన్ C పుష్కలంగా లభిస్తుంది .గుడ్డు: గుడ్డులో కావల్సినంత, మరియు మంచి ఐరన్ ఉంటుంది. రెగ్యులర్ గా గుడ్డును తినడం వల్ల రక్తంలోని హీమోగ్లోబిన్ నార్మల్ కండీషన్ లో ఉండటానికి సహాయపడుతుంది.

డాక్టర్ ఇచ్చిన మందులతో పాటు.. వీటిని రోజు వారి ఆహారంలో తీసుకుంటూ ఉంటే మనకు ఎటువంటి రక్తహీనత సమస్యలు లేకుండా శిశువు ఆరోగ్యంగా పెరుగుతాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: