జుట్టు.. మనిషికి అందం తెచ్చేది ఇదే.. అలాంటి జుట్టు అందంగా ఉండాలి అంటే.. మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.. ఏ ఒక్క పొరపాటు చేసిన మనకు ఉన్న జుట్టు ఊడిపోవడం.. చిట్లి పోవడం.. చుండ్రు రావడం వంటివి జరుగుతుంటాయి.. అందుకే మన జుట్టుని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి... అప్పుడే బలంగా ఉంటుంది.. 

 

ఇంకా జుట్టు ఎంత బలంగా ఉన్న సరే.. కొందరి ఆ జుట్టు నచ్చదు.. ఎందుకు నచ్చదు అంటే వారికీ నచ్చిన స్టైల్ లో ఆ జుట్టు ఉండకపోవచ్చు.. అంతేకాదు.. వారికీ కావలసినట్టు రింగుల జుట్టు ఉండకపోవచ్చు.. లేదు అంటే స్ట్రయిట్ కావాలి అంటే ఉండకపోవచ్చు.. అయితే ఎంతోమందికి స్ట్రయిట్ జుట్టు కావాలి అని అనుకుంటుంటారు. 

 

ఇంకా అలాంటి స్ట్రయిట్ జుట్టు సహజంగా రావాలి అంటే ఏం చెయ్యాలో ఇక్కడ చదివి తెలుసుకోండి.. స్ట్రయిట్ నర్ సాయంతో రింగులుగా ఉన్న జుట్టును కాస్త బారుగా కనిపించేలా చేసుకోవచ్చు.. అయితే తరచూ ఇలా చేయటం వల్ల జుట్టు పొడిబారటం, జుట్టు పల్చబడటమే వంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 

 

అందుకే జుట్టు స్ట్రెయిటనింగ్‌ చేయడానికి ముందు మంచి షాంపూతో తలస్నానం చేయాలి. తర్వాత కండిషనర్‌ తప్పనిసరిగా ఉపయోగించాలి. ఇలా కండిషనర్‌ ఉపయోగించడం వల్ల డ్యామేజ్‌ తగ్గుతుంది. ఇంకా అంతే కాదు జుట్టు స్ట్రెయిటనింగ్ చేసే ముందు జుట్టు దెబ్బతినకుండా నాణ్యమైన హీట్ ప్రొటక్షన్ స్ప్రే ఉపయోగించడం మంచిది.

 

ఇంకా అంతేకాదు జుట్టు స్టయిలింగ్‌ పేరుతో అతిగా జెల్స్‌, మ్యూట్‌లు వాడటం మంచిది కాదు. అలాగే కొన్ని రకాల ల్యూబ్రికెంట్లూ నేరుగా చర్మం ద్వారా రక్తంలో కలిసి క్యాన్సర్‌లూ, అలర్జీలు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంది.. కాబట్టి ఎంత మీకు బ్యూటీ అవసరం అయినా సరే లిమిట్ లో ఉండటం మంచిది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: