ప్ర‌స్తుతం క‌రోనా వైరస్ ప్ర‌పంచ‌దేశాలు గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న సంగ‌తి తెలిసిందే. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్ దేశ‌దేశాల్లోనూ చాప‌ కింద నీరులా విస్త‌రిస్తోంది. ఈ మ‌హ‌మ్మారిని అడ్డుకునేందుకు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం ఈ వైర‌స్‌కు మందు లేక‌పోవ‌డంతో ప్ర‌భుత్వాలకు మ‌రింత త‌ల‌నొప్పిగా మారింది. దీంతో ప్ర‌పంచ‌దేశాల ప‌రిశోధ‌కులు క‌రోనా వ్యాక్సిన్‌ను క‌నిపెట్టే ప‌నుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో క‌రోనాకు మందంటూ ఓ యువ‌తి బాయ్ ప్రెండ్ వీర్యాన్ని పండ్ల ర‌సాల్లో క‌లుపుకుని తాగ‌డం అంద‌రికీ ఆశ్చ‌ర్యాన్ని గురి చేస్తుంది.

 

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. లండన్ కి చెందిన ఓ మహిళకు పెళ్లై.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆమె గత కొన్ని రోజులుగా వీర్యాన్ని జ్యూస్‌, స్మూతీల్లో కలుపుకుని తాగేస్తోంది. ఫిట్‌నెస్ ట్రైనీగా పనిచేస్తున్న‌ ఆమె ఇందుకు చెప్పిన కారణం తెలిస్తే షాక్ అవ్వ‌డం ఖాయం. వీర్యాన్ని పండ్ల రసాల్లో కలుపుకొని తాగ‌డం వ‌ల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంద‌ని మ‌రియు కరోనా వైరస్ దరిచేరదని చెబుతోంది. మందుల షాపుల్లో లభించే రసాయనిక ఔషదాలను తీసుకోవడం కంటే.. సహజంగా లభించే వీర్యాన్ని తాగడమే ఉత్తమం అని ఆమె చెప్పుకొస్తోంది. 

 

దాదాపు మూడు సంవత్సరాలుగా ఆమె అదే పని చేస్తుండటం విశేషం. దీని వ‌ల్ల గత మూడు సంవత్సరాలుగా కనీసం త‌న‌కు జలుబు, జ్వరం లాంటివి కూడా రాలేదని చెప్ప‌డం గ‌మ‌నార్హం. అలాగే త‌న‌కు కావాల్సిన వీర్యాన్ని తన బాయ్‌ఫ్రెండ్ సరఫరా చేస్తున్నాడని.. తన బాయ్‌ఫ్రెండ్ ఎంతో ఆరోగ్యంగా ఉంటాడని.. అందుకే తాను అతని వీర్యం మాత్రమే తీసుకుంటానని చెప్పడంతో అంద‌రూ ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. ఇక అన్ని సార్లు వీర్యం అందుబాటులోకి ఉండకపోవచ్చు. అందుకు నా పార్టనర్‌ నుంచి సేకరించిన వీర్యాన్ని ఫ్రీజర్‌లో పెట్టి నిల్వ చేస్తాను అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా.. కనీసం వారానికి మూడుసార్లు వీర్యాన్ని ఆమె తాగుతానని చెబోతోంది. 

 

ఇక చాలా మంది సౌందర్యం కోసం వీర్యాన్ని ఫేషియల్స్ గా వాడగా లేనిది.. తాను ఆరోగ్యం కోసం వాడటంలో తప్పేముంద‌ని ఎదురు ప్ర‌శ్నించి కూడా. అయితే దీనిపై స్పందించిన నిపుణులు.. ఈ మ‌హిళను ఎవ్వ‌రూ ఫాలో అవ్వకూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ఇలా చేయ‌డం వ‌ల్ల క‌రోనా రాదు, ఆరోగ్యవంతులౌతారనే విషయాల్లో ఎలాంటి నిజం లేదని తెలిపారు. ఆమెది కేవ‌లం న‌మ్మ‌కం మాత్ర‌మే.. అందుకు ఎలాంటి ఆధారాలు లేవు. కాబ‌ట్టి.. ఇలాంటి ప్ర‌య‌త్నాలు చేసి ప్రాణాల మీద‌కు తెచ్చుకోవ‌ద్ద‌ని హెచ్చ‌రించారు.

 
  
  

మరింత సమాచారం తెలుసుకోండి: