ఒక్క తెలుగులోనే కాదు ఇండియన్ సినిమాలో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ స్టార్ హీరోకి రాని ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ కి అత్యంత తక్కువ కాలంలో వచ్చింది అనేది వాస్తవం. పవన్ కళ్యాణ్ తన జీవితంలో చేసిన సినిమాలు తక్కువే అయినా సరే ఆయన వ్యక్తిగత జీవితం గురించే ఆయన అభిమానులకు ఎక్కువగా ఆసక్తి ఉంటుంది అనేది వాస్తవం. ఆయన సినిమాల కంటే కూడా ఆయన జీవితం గురించే ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అభిమానులు. 

 

ఇక అది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ జీవితంలో ఆయన తల్లి పోషించిన పాత్ర చాలా కీలకం అని చెప్తూ ఉంటారు. చిరంజీవి సినిమాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత తన తల్లి తన వద్దే ఉండే వారట. పవన్ ఎక్కువగా తల్లి తో సమయాన్ని గడపడమే కాదు ఆమె తో అన్ని విషయాలను ఆయన షేర్ చేసుకునే వారు అని చెప్తారు. పవన్ కళ్యాణ్ కి ఆవేశం చాలా ఎక్కువ. ఆయన తల్లి ఆ ఆ ఆవేశాన్ని ఎక్కువగా కంట్రోల్ చేస్తూ ఉండే వారని అలాగే పవన్ కళ్యాణ్ ఇష్టాలను ఆమె ఎక్కువగా తెలుసుకుని పవన్ కళ్యాణ్ కి ఎక్కువగా సహకారం అందించే వారని అంటారు. 

 

పవన్ కళ్యాణ్ తన జీవితంలో చిన్న తనంలో చాలా ఇబ్బందులు పడ్డారు అని ఆ సమయలో తల్లి నుంచి ఆయనకు చాలా మంచి ప్రోత్సాహం అందింది అని చెప్తారు. పవన్ ఎన్ని కష్టాలు పడినా సరే తల్లి నుంచి అందిన సహకారం తోనే నేడు ఈ స్థాయిలో ఉన్నారు అనేది చాలా మంది చెప్పే మాట. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఈ స్థాయిలో ఉండటానికి ఆమె ప్రోత్సాహం చాలా కీలకంగా మారింది అని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: