రాజకీయాల్లో రాణించడం అంటే అంత సులువు కాదు. ప్రతీ నిమిషం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ప్రతీ నిమిషం కూడా రాజకీయాల మీద పట్టు అనేది ఉండాలి. రాజకీయాలు అనేది ఊహించుకునే అంత సులువు కూడా కాదు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి ఈ విషయం స్పష్టంగా తెలుసు కూడా. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన రోజు నుంచి నేటి వరకు కూడా ప్రత్యర్ధుల నుంచి ఎదుర్కొన్న అవమానాలు అన్నీ ఇన్నీ కాదు. ప్రతీ నిమిషం కూడా ఆయన ప్రత్యర్ధులు ఆయన్ను మానసికంగా క్రుంగ దీసే విధంగానే వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. 

 

అయినా సరే లోకేష్ నేడు రాజకీయాల్లో నిలబడుతున్నారు. ప్రతీ నిమిషం కూడా విపక్షాల ఆరోపణలను మంత్రి గా ఉన్న సమయంలో ఆయన తిప్పికొట్టే వారు. అయితే లోకేష్ రాజకీయాల్లో ఇప్పుడు ఇలా ఉండటానికి గానూ ప్రధాన కారణం నారా భువనేశ్వరి అని అంటూ ఉంటారు. ఆమె ఆయనకు అన్ని విధాలుగా అండగా నిలిచారు అని అందుకే నేడు లోకేష్ ఈ స్థాయిలో ఉన్నారు అని అంటారు. తండ్రి సిఎం గా ఉన్న సమయంలో లోకేష్ మంత్రి అయ్యారు కాబట్టి చంద్రబాబు కూడా బిజీ గానే ఉండే వారు. ఆయనతో మాట్లాడే అవకాశం చాలా తక్కువగా వస్తూ ఉండేది. 

 

లోకేష్ కి యంత్రాంగం మీద కూడా పట్టు చాలా తక్కువగా ఉండేది. ఈ సమయంలో తల్లి ఆయనకు అండగా నిలిచారు. అప్పటి విపక్షాల ఆరోపణలను లోకేష్ చాలా సమర్ధవంతంగా తిప్పి కొట్టినా ఆయన శాఖలో ఎన్నో అవార్డులు వచ్చినా సరే దాని వెనుక తల్లి సలహాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. చంద్రబాబు బిజీ గా ఉండటం తో లోకేష్ కి ఆమె అండగా నిలబడ్డారు. అదే లోకేష్ కి చాలా వరకు కలిసి వచ్చింది అని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: