మన తెలుగులో చిరంజీవి అంటే ఒక రేంజ్. చిరంజీవి అనే పేరు ఒక ఊపు. తెలుగులోనే కాదు ఇండియన్ సినిమాలో చిరంజీవి అనే పేరు ఒక ఎనర్జీ ఒక ఊపు. చిరంజీవి జీవితం గురించో చిరంజీవి సినిమాల గురించో ఆయన వార్తల్లో ఉన్నా లేకపోయినా సరే చర్చలు జరుపుతూ ఉంటారు. ఆయన చేసిన సినిమాలు ఆయన పోషించిన పాత్రలు ఆయన సాధించిన విజయాలు ఆయన వ్యక్తిత్వం అన్నీ కూడా ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఉన్నవే. ఇక ఆయన వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆయన జీవితంలో తల్లి పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది అని అంటారు. 

 

చిరంజీవి కి తండ్రి చాలా చిన్న వయసు లోనే మరణించారు. ఇక చిరంజీవి సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఎక్కువగా అగ్ర హీరోలే ఉండే వారు. అప్పుడు సినిమాలు అంటే అక్కినేని, ఎన్టీఆర్, శోభన్ బాబు కృష్ణ. వీళ్ళ నలుగురి సినిమాలే ఎక్కువగా కనపడుతూ ఉండేవి టాలీవుడ్ లో. వీరి సినిమా లేకుండా ఉండేది కాదు. కాని ఆ సమయంలో కూడా మెగాస్టార్ చిరంజీవి తన పాత్రను పోషించారు. వారికి దీటు గా ఆయన ఎదిగారు. వారి తో పోటీ గా ఆయన సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. వారి సినిమాలు ఫ్లాప్ అయిన రోజుల్లో చిరంజీవి సినిమాలు సూపర్ హిట్ అయ్యేవి. 

 

మాస్ కి బాగా దగ్గరైన హీరో గా చిరంజీవికి మంచి గుర్తింపు ఉండేది. దీనికి కారణం ఆయన తల్లి అని అంటారు. చిరంజీవి కెరీర్ తొలి రోజుల్లో చాలా భయపడుతూ ఉండే వారని, ఆయనకు కథలు వినడం కూడా వచ్చేది కాదని, కాని తల్లి జోక్యం చేసుకుని ప్రతీ చిన్న విషయాన్ని కూడా పట్టించుకుని చిరంజీవి కి తన వంతు ప్రోత్సాహం ఆమె అందించే వారు అని అంటారు. ఆమె వలనే ఆయన ఈ స్థాయిలో ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: