రాజకీయాల్లో అయినా సినిమాల్లో అయినా వ్యాపారాల్లో అయినా సరే ఒక వ్యక్తి రాణించాలి అంటే కచ్చితంగా తల్లి ప్రోత్సాహం తండ్రి ప్రోత్సాహం చాలా అవసరం. తండ్రి కి చిరాకులు ఎక్కువ కాబట్టి తల్లి ప్రోత్సాహం అనేది చాలా ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అక్కినేని నాగార్జున విషయంలో దాదాపుగా తల్లి ప్రోత్సాహమే ప్రతీ నిమిషం ఆయన జీవితంలో ఉంటుంది అని అంటూ ఉంటారు ఆయన్ను దగ్గరగా గమనించిన వారు. నాగార్జున కు సినిమాల మీద ఎంత ఆసక్తి ఉందో... వ్యాపారాల మీద కూడా అదే స్థాయిలో ఉంటుంది. 

 

నాగార్జున ఏది అయినా అనుకున్నారు అంటే సాధించే వరకు వదిలే అవకాశం ఉండదు అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు నాగార్జున వ్యాపార రంగంలో ఈ స్థాయిలో ఉన్నారు అంటే కచ్చితంగా ఆయనకు తల్లి ప్రోత్సాహమే ప్రధానం అని చెప్తూ ఉంటారు జనాలు. తండ్రి అక్కినేని సినిమాల్లో బిజీ గా ఉన్న సమయంలో అతని సినిమాలు పట్టించుకోవడమే కాకుండా నాగార్జున కు వ్యాపారం మీద ఉన్న దృష్టి ని ఆమె స్వయంగా తెలుసుకునే వారు. సినిమాలే కాదు వ్యాపారాలు కూడా చెయ్యాలి అని నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించింది తల్లి అని అంటారు. 

 

తల్లి ప్రోత్సాహం తోనే అతను వ్యాపారాల మీద ఎకువగా పెట్టుబడి పెట్టిన సందర్భాలు ఉన్నాయని ఆమె స్వయంగా అతని సినిమాల గురించి తెలుసుకోవడమే కాదు వ్యాపారాల గురించి కూడా కీలక సలహాలను ఇస్తూ ఉండే వారని, తండ్రి కంటే ఆమె పాత్ర వ్యాపారాల మీద ఎక్కువగా ఉండేది అని అంటారు. నాగార్జున నేడు టాలీవుడ్ లో విజయవంతమైన వ్యాపార వేత్త. టాలీవుడ్ లో ఈ స్థాయిలో వ్యాపారవేత్తగా క్లిక్ అయిన హీరో మరొకరు లేరు అనేది వాస్తవం. దీనికి కారణం ఆయన తల్లి అన్నపూర్ణమ్మ అని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: