మాతృత్వం అనేది ప్రతి మహిళ జీవితంలో ఒక గొప్ప అనుభూతి.అమ్మ అనే పిలుపు పిలిపించుకోడానికి ప్రతి తల్లి తాపత్రయపడుతుంది. అయితే బిడ్డ కడుపునా పడ్డాక  ప్రతి మహిళలో కొంచెం ఆందోళన అనేది ఉంటుంది. బిడ్డ ఎదుగుదల ఎలా ఉంది. అన్ని అవయవాలు సరిగా వచ్చాయా లేదా అన్న ఒత్తిడితో ఉంటుంది.అయితే  గర్భధారణ సమయంలో గర్భిణీ ఆమెకోసం మాత్రమే కాకుండా కడుపులో పెరిగే బిడ్డకోసం కూడా ఎక్స్ ట్రా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. తినే ఆహారం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.మహిళ గర్భం పొందిన తర్వాత ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అన్న  కొన్ని ముఖ్యమైన విషయాలు  చిట్కాలున్నాయి. గర్భిణీ తీసుకునే ఆహారాలు మరియు చేసే పనులు అన్నీ కడుపులో పెరిగే బిడ్డ మీద ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా మొదటిసారి గర్భం పొందిన వారిలో ఏలాంటి పనులు చేయాలి, ఎలాంటి ఆహారాలు తీసుకోవాలనే వాటి మీద సరైన అవగాహన ఉండదు.

 

 

ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణీలు చాలా విషయాలను తెలుసుకోవడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కొసారి గర్భం పొందినప్పుడు ఒక్కొ విధమైన లక్షణాలు కనబడుతాయి. అలాగే ఒక్క గర్భిణీస్త్రీకి మరో గర్భిణీ స్త్రీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. లక్షణాల్లో కూడా చాలా తేడా ఉంటుంది. గర్భిణీ స్త్రీలకు ఫోలిక్ యాసిడ్ అత్యవసరమైనది. గర్భిణీకి మాత్రమే కాదు, బేబీ పుట్టకలోపాలను నివారిస్తుంది.  నేచురల్ గా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, అరటిపండ్లు, ఆరెంజెస్ తీసుకోవాలి.సరిగా ఉడకని మాంసాహారం మంచిది కాదు, బాగా ఉడికని చికెన్ గుడ్డు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కు కారణమవుతుంది. అది బేబీకి కూడా హానికలిగిస్తుంది. వీటిని తీసుకునే ముందు బాగా ఉడికించి , సరిగా ఫ్రై చేసి తీసుకోవాలి.గర్భం నిర్ధారణ అయిన తర్వాత , థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడం చాలా అవసరం థైరాయిడ్ హార్మోన్ లోపం వల్ల బేబీ బ్రెయిన్ డెవలప్ మెంట్ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది.గర్భధారణ సమయంలో ప్రోటీన్ ఫుడ్స్ ముఖ్య పాత్ర వహిస్తాయి. బేబీ గపెరుగుదలకి  ఇవి చాలా అసవరం. మిల్క్, డైరీ ప్రొడక్ట్స్, బీన్స్, లెగ్యుమ్స్, ఫిష్, చికెన్, మరియు మీట్ వంటి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి.

 

 

పుట్టబోయే బిడ్డకు ఫ్యూచర్ లో ఇన్ఫెక్షన్స్ కలగకుండా ఉండేదకు తల్లి కొన్ని వాక్సినేషన్ ను తీసుకోవాలి. ఇవి బేబీ ఇమ్యూనిటి పెంచి  తగినంత బలాన్ని చేకూర్చుతాయి . . గర్భిణీ వేసుకోవల్సిన వాక్సినేషన్ గురించి డాక్టర్ ను అడిగి తెలుసుకోవాలి.గర్భిణీలు  ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారాలను  తీసుకోకుండా ఉంటే మంచిది. ఇవి బేబీ హెల్త్ కు చాలా ప్రమాధకరం. వాటి మీద l క్రిమిసంహారక మందులను ఎక్కువగా చల్లి ఉంచడం వల్ల తల్లితో పాటు బిడ్డకు కూడా ప్రమాదకరమే.ప్రెగ్నెన్సీ మహిళలకు ఇవి సురక్షితమైన ఆహారాలు కాదు. ఇవి గర్భస్రావానికి కారణమవుతాయి.గర్భిణీ రోజుకు సరిపడా నీరు తాగుతుండాలి. ఫ్రూట్ జ్యూస్ లతో పాటు నీరు తాగడం వల్ల శరీరంలోని విషపదార్ధాలు  బయటకు విసర్జింపబడుతాయి. దీనివల్ల తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా...హెల్తీగా ఉంటారు

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: