తల్లి కావాలనే కోరిక ప్రతి మహిళకు ఉంటుంది.. బిడ్డతో అమ్మ అని పిలిపించుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. అయితే గర్భిణీ గా ఉన్నపుడు ఎన్ని జాగ్రత్తలు పాటించామో అలాగే బాలింత అప్పుడు కూడా అలానే జాగ్రత్తగా ఉండాలి. అయితే ఏమేమి తినాలి, ఎలా ఉండాలి అనేదాని గూర్చి చూద్దాం. కాన్పు కాగానే చాలా మంది బాలింతలకు ఆహారనియమాలు వాళ్ళ ఆచారాల్ని బట్టి పాటిస్తుంటారు.

 

కాన్పు అయిన అరగంటకే వేడిగా పాలు లేదా టీ ఇవ్వవచ్చు. కాన్పు కావడమనేది నేచురల్‌ ప్రాసెస్‌. ఇది వ్యాధికాదు, కాని పచ్చి బాలింత అని ఆహారంలో అనేక ఆంక్షలు విధిస్తుంటారు. బాలింతలు ఒకపూటే భోజనం చేయాలని, చల్లగా ఏమీ తీసుకోరాదని దాని వల్ల శీతలం కమ్ముకుంటుందని, పుట్టిన బిడ్డకు జలుబు,నిమ్ము చేస్తుం దనుకుంటారు. బాలింతరాలు మజ్జిగ, పెరుగువాడరాదని వాతం వస్తుందని, బిడ్డకు శీతలం చేస్తుందని ఇవ్వరు. అలాగే పచ్చి ఒళ్లు అని కటికకారం తింటే మంచిదని పెట్టడంవల్ల కడుపులో మంట, అసిడిటీ వస్తుంది. పండ్లు, పండ్లరసాలు తీసుకోవచ్చు.

 

 

అతి శీతలంగా ఉన్నఐస్‌క్రీమ్స్‌, కూల్‌ డ్రింక్స్‌ మాత్రం వాడరాదు. బాలింత లు నీళ్ళు ఎక్కువగా త్రాగితే పొట్ట పడుతుందనీ, వళ్లు వస్తుందనీ దాహంగా ఉన్న నీళ్ళు ఇవ్వడానికి సంకోచిస్తారు. బాలింతలకి కాన్పు కాగానే ప్రసవనొప్పుల వల్ల కలిగే అలసట, నీరసం, స్ట్రెయిన్‌, స్ట్రెస్‌ తగ్గడానికి గోరువెచ్చని నీళ్ళు లేదా పాలు ఇవ్వ వచ్చు. దాహం అయినప్పు డల్లా పండ్లు, రసాలు, వేడిగా పాలు తీసు కోవడం మంచిది. దీనివల్ల మూత్రం సాఫీగా జరుగుతుంది. అలాగే రాత్రిళ్ళు భోజనం పెట్టకపోవడం కూడా మంచిది కాదు. దీనివల్ల బాలింతలు నీరసించి చంటి పిల్లలకి పాలు సరి పడక, నిస్సత్తువతో పాలు ఇవ్వలేక బాధ పడుతుంటారు. ఎలాఇలా బాలింతలు తగు జాగ్రత్తలు తీసుకుంటే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం. 

మరింత సమాచారం తెలుసుకోండి: