ఆడవాళ్లు బిడ్డని కనటానికి ఎంత కష్టం అయిన సరే భరిస్తారు..ఎన్ని నొప్పులు అయిన సరే అనుభవిస్తారు. తర్వాత పుట్టిన బిడ్డని చూసాక ఆ భాధ అంతా మరిచిపోతారు చాలా మంది ఆడవారికి నార్మల్ డెలివరీ చాలా కష్టంగా ఉంటుంది. డాక్టర్లు కూడా నార్మల్ డెలివరీ చేయడానికి అంతగా ముందుకు రారు. ప్రెగ్నెంట్ పరిస్థితిని చూసి కూడా చాలా మంది డాక్టర్లు నార్మర్ డెలివరీకి రెఫర్ చేయరు.

 

దీంతో గర్భిణీలు కూడా సిజేరియన్ కే ఒకే అంటారు. అయితే సిజేరియన్ విధానంలో కంటే నార్మర్ డెలివరీలో ప్రసవిస్తేనే మంచిది. కొన్ని రకాల సూత్రాలు పాటిస్తే ప్రతి గర్భిణీ నార్మర్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది.నార్మల్ డెలివరీ అయితే భవిష్యత్తుల్లో ఎలాంటి ఇబ్బందులుండవు. దీని వల్ల పుట్టబోయే బిడ్డకు ఎలాంటి అనారోగ్యాలు తలెత్తవు.

 

గర్భంలో నుంచి వచ్చిన బిడ్డకు బయటి వాతావారణాన్ని తట్టుకోగల శక్తి ఆ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా వల్ల లభిస్తుంది. అందుకే బిడ్డ ఆరోగ్యానికి నార్మల్ డెలివరీ చాలా బెస్ట్.ఎలాంటి అనారోగ్యాలు లేని మహిళలంతా నార్మల్ డెలివరీకే ప్రియారిటీ ఇస్తే మంచిది. వాస్తవానికి సిజేరియన్‌ డెలివరీ అనేది చాలా కొంతమందికే అవసరం. కానీ చాలా మంది గర్భిణీలు ఆ విషయం తెలియక సిజేరియన్ చేయించుకుంటున్నారు.అయితే నార్మల్ డెలివరీ కోరుకున్న వాళ్లంతా కూడా అందుకు తగ్గట్లుగా ముందు నుంచే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నార్మర్ డెలివరా ? సిజేరియన్ డెలివరా ? అనేది డాక్టర్లు ముందుగానే నిర్ణయించగలుగుతారు

 

 

.ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచీ మీరు తీసుకునే ఆహారం, మీ ఆరోగ్యాన్ని బట్టీ మీకు నార్మల్ డెలివరీ అవుతుందా లేదంటే సిజేరియన్ అవుతుందో డాక్టర్లు చెప్పగలరు.ప్రెగ్నెంట్ హెల్తీగా ఉంటే గర్భంలోని బిడ్డ ఆరోగ్యంగా ఉంటే చాలు. అలాగే ప్రెగ్నెన్సీ పీరియడ్ మొత్తం కూడా నార్మల్ గా కంటిన్యూ అయితే చాలు.. మీరు నార్మల్ డెలివరీకి రెడీ అయినట్లే.ప్రెగ్నెంట్ కాకముందే ఆరోగ్య సమస్యల్ని నయం చేసుకోవాలి. గర్భం దాల్చాక అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలి. ఎందుకంటే ప్రెగ్నెంట్ అయ్యాక వారు అన్నిరకాల మెడిసిన్స్ వినియోగించకూడదు.షుగర్, బీపీ ఉంటే వాటిని కంట్రోల్ లో ఉంచుకునేలా చూసుకోవాలి. అవి పూర్తిగా కంట్రోల్ అయ్యాకే ప్రెగ్నెంట్ అయితే ఎలాంటి ఇబ్బంది ఉండవు. అలాగే బాలింతకి భవిష్యత్తులో నడుము నొప్పి రాకుండా ఉంటుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: