మనకోసం తాపత్రయ పడే వాళ్లలో అమ్మని మించిన వారు ఎవరు లేరు. మనం తన కడుపున పడ్డ ప్రతి క్షణం నుంచీ తన ఆలోచనలలో వుండేది తన బిడ్డ.తన బిడ్డ ఎదిగిన తర్వాత తనని ఎలా చూసుకోవాలో అని ప్రతి నిమిషము తపన పడే వ్యక్తి మన నాన్న. ఎదిగే కొద్ది మురిసిపోయి మనల్ని లాలించి, ఆడించి ,పాడించేది మన తల్లీ తండ్రీ.. మనకి కష్టం వస్తే కన్నిళ్ళని  తుడిచి మనకోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి అందులో వాళ్ళ సంతోషం వెతుక్కుంటూ సంతోషం తో గడిపేసేవాల్లు మన అమ్మ నాన్న.మనం ఒక మంచి స్ధానం లో ఉంటే చూడాలని.. మనల్ని కంటికి రెప్పలా కాపాడుకునే వాళ్ళని మనం ఎలా చూస్కుంటున్నమో ఒక్కసారైనా ఆలోచించారా???

 

 

మన తల్లి తండ్రిని వదిలి సంపాదన కోసం వేర్వేరు దేశాలకు వెళ్ళి , మన భార్య ,బిడ్డల సంతోషం కోసం సంపాదన కై వెతుకులాటలో పడి కన్న తల్లి తో కనీసం ఫోన్ లో కుడా మాట్లాడటం మరచి ..మనకై తపించే తల్లి తండ్రి ని పూర్తిగా విడిచి వెళ్లిపోవడం ఎంత వరకు న్యాయం అని ఒక్కసారైనా మిమ్మల్నీ మీరు ప్రశ్నించుకుంటే మీకు అర్థం అవుతుంది .. ఆ తల్లదండ్రుల ఆవేదన.

 


మన తల్లి తండ్రి ఏదైనా జబ్బు తో బాధపడితే వారు అనాధ ల్లా ఎవరో ఫోన్ చేసి చెప్తే కానీ మనకి తెలియని దుస్తితి మన అమ్మ నాన్నలకు మనం కలిగిస్తున్నామని ఒక్కసారి ఆలోచించండి. మనల్ని నవమాసాలు మోసి కంటికి రెప్పలా కాపాడే తల్లిని మించిన ఆనందం, ఆస్థి మరెక్కడా మనకు దొరకదు. మనకంటూ ఒక గుర్తింపు ఇచ్చింది మన అమ్మ అన్న విషయాన్నీ మరిచిపోకండి. 

 

 నీవు జ్వరం తో బాధపడితే తను కంటి మీద కునుకు లేకుండా నీకు సేవలు చేసే అమ్మ నీ నువ్ తీస్కొని వృద్ధాశ్రమానికి వెలుతున్నావ్??రేపు నీ పిల్లలు నీకు ఇదే దుస్తితి నీ కల్పిస్తే నీ గుండె తట్టుకొగదా???
ఇప్పటికైనా మేల్కొని మన" అమ్మ కోసం ఏమైనా చేసేద్దాం"అందరూ కలిసి మెలసి సంతోషం గా ఉందాం..
పెద్ద వారి పట్ల చూపించాల్సిన గౌరవ మర్యాదలు నేర్పిద్దాం. అలాగే చిన్నవారి పట్ల చూపించాల్సిన ప్రేమని తెలిసేలా చేద్దాం.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: