ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టె సమస్యలలో పులిపిరి కాయలు ఒకటి. పులిపిరి కాయల సమస్య ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. వీటిని ఉలిపిరి కాయాలని కూడా అంటారు, ఇంగ్లీష్‌లో వీటిని వార్ట్స్ అంటారు. హ్యూమన్ పాపిలోమా అనే వైరస్ వల్ల ఈ పురిపిరులు ఏర్పడతాయి. ఇవి ఎక్కువగా ముఖం, మెడ, చేతులు, పాదాలపై వస్తుంటాయి. చర్మంలో కలిసిపోయే కొన్ని పులిపిర్లు పెద్దగా నొప్పిరావు. కానీ, కొన్ని దురద పుడుతుంటాయి.

 


యాపిల్ సిడర్ వెనిగర్లో అధిక యాసిడ్ కంటెంట్ ఉంటుంది. దీనివల్ల పులిపిర్లు మరింత పెరగకుండా సహజ సిద్ధంగా తగ్గిపోతాయి. దూదిని యాపిల్ సిడర్ వెనిగర్‌లో ముంచి పులిపుర్లు ఉన్నచోట అద్దితే చాలు. వారంలో కనీసం ఐదు రోజులు ఇలా పూర్తిగా మాయమవుతాయి.
కలబందలో ఉండే మేలిక్ యాసిడ్ పులిపిర్లలోని ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. ఇందుకు మీరు కలబంద ఆకు మధ్యలో ఉండే జిగురును తీసుకుని పులిపిర్లపై రాస్తే చాలు. ఆముదంలో కాస్త బేకింగ్ పౌడర్ వేసి బాగా కలపండి. దాన్ని పులిపిర్లపై రాసి బ్యాండేజ్ వేయండి. అలా రాత్రంతా వదిలిపెట్టండి. ఇలా రెండు నుంచి మూడు రోజులు చేసినట్లయితే పులిపిర్లు పూర్తిగా తొలగిపోతాయి.

 

 

అరటి పండు తొక్కలో ఉండే ఎంజైమ్‌లు చర్మానికి మేలు చేస్తాయి. అరటి పండు తొక్కతో రోజు పులిపిర్లపై రుద్దితే అది క్రమేనా కనుమరుగు అవుతుంది.
చర్మ వ్యాధుల నివారణకు వెల్లులి మంచి ఔషదం. ఇందులో ఉండే ఎల్లిసిన్.. ఫంగస్, వైరస్ వంటి బ్యాక్టీరియాలతో పోరాడుతుంది. అలాగే పులిపిర్లను తొలగించడంలోనూ ఇది అత్యుత్తమంగా పనిచేస్తుంది. ఇందుకు మీరు వెల్లులి ముద్దగా చేసుకుని పులిపిర్లు ఉన్నచోట రాస్తే చాలు.అలాగే పైనాపిల్ కూడా పులిపిర్లు తగ్గించడంలో మంచిగా ఉపయోగపడుతుంది. కొంచెం పైనాపిల్ జ్యూస్ తీసుకుని అందులో కొంచెం ఉప్పు కలపాలి. ఈ మిశ్రమాన్ని తీసుకుని పులిపిర్లు ఉన్నచోట రాస్తూ మర్దన చేయాలి.. ఇలా వారానికి నాలుగు సార్లు చేస్తే పులిపిర్లు తగ్గుముఖం పడతాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: