సాధార‌ణంగా మ‌హిళ‌ల‌కు రుతుక్రమం మొదలైన తర్వాత నుంచి ప్రతి నెలా నెలసరి వచ్చి పలకరించి వెళుతుంది. పీరియడ్స్.. అది అత్యంత సహజం.  అది తప్పు కాదు, పాపం కాదు. ఈ సృష్టి ముందుకు నడవడానికి అవసరం. ఇక ఈ టైమ్‌లో ఆడవారు పీరియడ్ క్రాంప్స్ వల్ల నీరసంగా ఉంటారు. మ‌రియు ఆడ‌వారు ఈ స‌మ‌యంలో కడుపు నొప్పి, నడుము నొప్పి వంటివి ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి. ఒక్కోసారి ఈ నోప్పులు భ‌రించ‌లేనంత‌గా ఉంటాయి. ఇది ఎక్కువ శాతం ఒత్తిడి వల్ల, హార్మోన్ల అసమతుల్యత వల్ల కలుగుతుంది.

 

అయితే ఇలాంటి స‌మ‌యంలో అలసట కలిగించే పనులు చేయాలనుకోరు. ముఖ్యంగా వ్యాయామం. కానీ నెలసరి సమయంలో వ్యాయామం నుండి విరామం తీసుకోవాల్సిన అవసరం లేదు. వాస్తవానికి, శరీరాన్ని చురుగ్గా ఉంచడం వల్ల నెలసరి సమయంలో ఇబ్బంది పెట్టే లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది. నెలసరి ఇబ్బందులు శారీరకంగా చురుగ్గా ఉండటాన్ని ఆపకూడదు. ఆ సమయంలో ఇబ్బందికరంగా, తిమ్మిరితో బాధపడవచ్చు, కానీ నెలసరి సమయంలో శారీరక శ్రమలో పాల్గొనడం ఇంకా మంచిది. మిగతా రోజుల్లాగా హార్డ్ వర్కవుట్స్ చేయలేం అనుకున్నా ఏం పర్వాలేదు. 

 

తేలికపాటి వ్యాయామం చేసినా మంచిదే. ముఖ్యంగా పైలేట్స్ లేదా రన్నింగ్ వంటి తక్కువ-తీవ్రత గల వ్యాయామాలను ఎంచుకోవచ్చు. కానీ, పీరియడ్స్ సమయంలో కొన్ని వ్యాయామాలు చేయకూడదు. ముఖ్యంగా పొట్ట మీద ఒత్తిడి పడే ఏ వ్యాయామాలు చేయకూడదు. ఎందుకంటే అందువల్ల ఎక్కువ రక్త స్రావం అయ్యే అవకాశం ఉంది. దీని వల్ల మరింత అలసట, నీరసంగా ఉంటుంది. ఇక చాలా మంది మహిళలు పీరియడ్స్‌లో నొప్పి నుంచి ఉపశమనం పొందే మందులకు దూరంగా ఉంటారని, కడుపు నొప్పులకు టీ, కాఫీ, గ్రీన్ టీ తాగడానికి ఇష్టపడతారని నమ్ముతారు. కానీ ఎక్కువ కెఫిన్ తీసుకోవడం వల్ల, శరీరంలో నీరు నిలుపుకోవడం మొదలవుతుంది మరియు ఉబ్బరం వస్తుంది, ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది.

  

మరింత సమాచారం తెలుసుకోండి: