తల్లి కావడం అనేది  ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గొప్ప మధురమైన అనుభూతి. స్త్రీ గర్భం ధరిస్తే చాలా ఆనందం చెంది తన భావోద్వేగాలు చెప్పలేనంతగా ఉంటాయి. స్త్రీ గర్భం దాల్చడంతో శారీరకంగా చాలా మార్పులు సంతరించుకొంటాయి.అయిన గాని బిడ్డని కనడానికి ఈ మాత్రం వెనుకాడదు. అది తల్లి ప్రేమ.  పొట్టలో బేబీ పెరిగే కొద్దిగా పొట్ట ముందుకు పెరుగుతూ ఉంటుంది.  ఉదయం పూట ఎక్కువ అలసట చెంది వేవిళ్ళు చేసుకోవడం ఇవన్నీ గర్భిణీలో సాధారణంగా కనిపించే మార్పులు  అయితే ఇవన్నీ కామన్ గా వచ్చే మార్పులు. మరి గర్భిణీగా ఉన్నప్పుడు ఈ మార్పులతోనే కాకుండా మరొకొన్ని ఇతర మార్పులు గర్భిణీ స్త్రీని ఇబ్బంది పెట్టి అసౌంకర్యానికి గురిచేస్తాయి. గర్భిణీగా ఉన్నప్పుడు ఎక్సెస్ గ్యాస్ తో ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది.

 

 

గర్భిణీగా ఉన్నప్పుడు హార్మోన్ లలో మార్పుల వల్ల జీర్ణవ్యవస్థ మందగించి తిన్న ఆహారం త్వరగా అరగనివ్వకుండా చేస్తుంది. దాంతో గర్భిణీ స్త్రీ చాలా ఇబ్బందికరంగా ఫీలవ్వడమే కాకుండా చాలా సార్లు కంట్రోల్ చేసుకోలేకపోతుంది. ఈ సమస్యను నిర్మూలించడానికి కొన్ని ఆహార నియమాలు పాటించాలి మరియు రెగ్యులర్ గా వ్యాయమం చేస్తే ఫలితం ఉంటుంది. ప్రతి రోజూ చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. దాంతో గ్యాస్ట్రిక్ ప్రాబ్లెం నుండి బయట పడవచ్చు. మంచి ఆహారం తరచూ తీసుకోవాలి. ముఖ్యంగా గ్యాస్ ను ఉత్పత్తి చేసే ఆహారాలకు దూరంగా ఉండాలి. ఉదా..కార్బొనేటెడ్ డ్రిక్స్, బీన్స్, కాలీఫ్లవర్, డ్రైఫ్రూట్స్, డైరీ ప్రొడక్ట్స్ కు దూరంగా ఉండాలి. తరుచుగా మూత్ర విసర్జన అనేది గర్భిణీ స్త్రీ లలో ప్రధాన సమస్య.

 

తరచూ మూత్ర విసర్జనకు పోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి గట్టిగా నవ్వినప్పుడు కానీ లేదా దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ యూరిన్ లీక్ అయ్యి గర్భిణీ అసౌకర్యానికి గురిచేస్తుంది. యూరినరీ లీకేజ్ ప్రాబ్లెం కొద్దిగా ఉంటే పర్వాలేదు ఎక్కువగా ఉన్నప్పుడు అందుకు తగ్గ కేర్ తీసుకోవాలి. లోపల ధరించే ప్యాటీలు మందగా ఉన్న కాటన్ తో తయారు చేసినవైత సౌకర్యంగాను సురక్షితంగాను ఉంటాయి. గర్భిణీగా ఉన్నప్పుడు వాసన పీల్చడం చాలా ఎక్కువగా ఉంటుంది. అటువంటప్పుడ కొన్ని వాసనలు చూడగానే ఇష్టం లేక చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. 

 

ఒక్కొ సందర్భంలో యోని స్రావాల నుండి కూడా దుర్వాసన పట్టని వారు డాక్టర్ కు చూపించి యాంటీ ఫంగల్ మెడిసిన్ ను తీసుకోవాల్సి ఉంటుంది. గర్భిణీగా ఉన్నప్పుడు అవాంచిత రోమాలు ఇబ్బంది పెడుతాయి. కొన్ని హార్మోనులలోని మార్పుల వల్ల అవాంచిత ప్రదేశాలు అయిన  బ్రెస్ట్, ఉదరం ముందు బాగం వెనక భాగాల్లో కూడా హెయిర్ గ్రోత్ ఉంటుంది. అయితే డాక్టర్ లు లేజర్ ట్రీట్ మెంట్ తో గర్భాధారణ సమయం చర్మ ఇన్ఫెక్షన్ కు గురిఅవుతుందని చెబుతుంటారు. గర్భాధరణ జరిగిన మూడవ నెలలో కొన్ని అదనపు హార్మోన్ల కారణంగా బ్లాక్ హెడ్స్,  మొటిమలు, జిడ్డు చర్మం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.అందుకు డాక్టర్ సలహా మేరకు మొటిమలను మెడికేటెడ్ ఫేష్ వాష్ లను ఉపయోగించి దూరం చేసుకోవచ్చు.  ఆహారంలో ముఖ్యంగా ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: