సెనగపిండి ముఖ సౌందర్యానికి మంచి ఫలితాన్ని ఇస్తుంది.సెనగపిండి అనేక చర్మ సమస్యల నుండి రక్షిస్తుంది.సెనగపిండిని వాడడం వల్ల చర్మం మీద ఉన్న నలుపును మరియు మృతకణాలని తొలగిస్తుంది. అలానే చర్మం కాంతివంతంగా మరియు మృదువుగా మారడానికి ఉపయోగపడుతుంది. సెనగపిండి ఎటువంటి చర్మం వారికైనా మంచి ఫలితం ఇస్తుంది.అయితే ఇప్పుడు సెనగపిండిని ఏవిధంగా ఉపయోగిస్తారో చూద్దాం.

 

 

ఒక్క స్పూన్ సెనగపిండిలో ,1/2 స్పూన్ గోధుమపిండి వేసి బాగా కలపాలి అందులో ఒక చిటికెడు పసుపు మరియు కొంచెం పెరుగు వేసుకుని బాగా కలుపుకుని పేస్ట్ లా చేసుకోవాలి.ఈ పేస్ట్ ను మొహానికి రాసుకుని అరగంట ఉంచుకుని తర్వాత చల్లని నీటితో కడుకోవాలి.ఇలా చెయ్యడం వల్ల చర్మం కాంతివంతంగా మారడమే కాకుండా ముకరంధ్రాలని తగిస్తుంది.ఎందుకంటే గోధుమపిండి చర్మాన్ని లోతుగా శుభ్రం చేసి మృదువుగా, కాంతివంతంగా మారడానికి బాగా ఉపయోగపడుతుంది.గోధుమలో ఉన్న పోషకాలు చర్మానికి పోషణని ఇస్తాయి.అలానే పసుపులో ఉన్న పోషకాలు చర్మంపై బాక్టీరియాని తొలగిస్తాయి మరియు చర్మంపై ఉన్న మొటిమలు,నల్లనిమచ్చలు రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది.ముఖం మచ్చల నుండి కాపాడబడుతుంది. 

 

ఇక పెరుగులో ఉన్న ఏసిటీసీ ఆమ్లం పోషకాలు చర్మానికి పోషణని అందించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. ఇక శనగపిండి, వరిపిండి, ఒక్కొక్క స్పూన్ చొప్పున తీసుకుని దీనికి కొద్దిగా పాలు.ఆలివ్ ఆయిల్ లేదా ఏదైనా వంట నూనె నాలుగైదు చుక్కలు చేర్చి మెత్తని మిశ్రమం లా చేసి ముఖానికి, మెడకు పట్టించి ఆరాక చల్లని నీటితో కడగాలి. పొడిచర్మం చర్మం కలిగిన వాళ్ళకి ఇది మంచి స్క్రబ్. తరచూ ఇలా చేస్తే చర్మానికి కొత్త నిగారింపు వస్తుంది.అలాగే సెనగపిండిలో కొంచెం పాలు, పసుపు వేసుకుని ముఖానికి రాసుకుని ఒక పావుగంట సేపు ఉంచుకుని చల్లని నీటితో కడుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. మన వంటింట్లో ఉండే శెనగపిండి వల్ల ఎన్ని ఉపయోగాలో చూసారు కదా.. ఇంకెందుకు ఆలస్యం మీ అందానికి మెరుగులు దిద్దండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: