గర్భం ధరించిన స్త్రీ ప్రయాణం చేయకూడదనీ, ప్రయాణం చేస్తే గర్భ విచ్ఛిత్తి అవుతుందన్న భయం చాలా మందిలో ఉంది. గర్భవతి ప్రయాణం చేస్తే అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయన్న అభిప్రా యమూ ఎందరిలోనో ఉంది. కానీ, వర్తమాన సమాజంలో స్త్రీలు కూడా ఎంతో కీలకమైన ఉద్యోగాలు చేస్తున్నారు.బస్సుల లోనూ, ఆటోలలోనూ, కార్లల్లోనూ, లోకల్‌ ట్రైన్లలోనూ ప్రయాణం చేసి ఆఫీసుకూ, అదేవిధంగా ఇంటికి చేరు కోవాలి కదా! అందుకని, గర్భం ధరించిన సమయంలో స్త్రీలు సరైన జాగ్రత్తలు తీసుకుంటూ, అవసరమైతే డాక్టరును సంప్రదిస్తూ ఆరోగ్యాన్ని కాపాడు కోవాలి. ముఖ్యంగా ప్రయాణ సమయాల్లో తీసుకోవాల్సిన కొన్ని ప్రాథమికమైన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.

 

 

 

గర్భిణులు దూర ప్రయాణం ఎక్కువ సమయం చేయడం మంచిది కాదు. ముఖ్యంగా మూడు నెలలలోపు, నెలలు నిండి ప్రసవ సమయం దగ్గర పడినప్పుడు. హై బిపి, మధుమేహవ్యాధి ఉన్నప్పుడు, తల తిరగడం, వికారం, వాంతులవడం, రక్తస్రావం అయినప్పుడు - అటువంటి గర్భవతులు ప్రయాణాలు చేయకపోవడమే మంచిది.
మూడు నెలలు నిండినప్పటి నుంచీ ఎనిమిది నెలల లోపు అవసరమైతే గర్భిణీ స్త్రీ డాక్టరు సలహాతో ప్రయాణం చేయవచ్చు. గర్భస్థ శిశువుకు, గర్భవతికి సుఖంగా ఉండేలా, ఇబ్బందులు కలగకుండా ఉండేలా ప్రయాణం చేయాలి. ఇరుకుగా ఉన్న సీట్లల్లోనూ, కుదుపులు ఎక్కువగా ఉన్న రోడ్ల మీద ప్రయాణం చేయకూడదు.

 

 

 

దూరప్రయాణం చేస్తూ, బస్సు సీటులో ఇరుకుగా అనిపించినప్పుడు, ఎక్కువసేపు కూర్చోవడం ఇబ్బందిగా ఉన్నప్పుడు, బస్సు ఆగినప్పుడు క్రిందకు దిగి కొంత సమయం పచార్లు చేయడం మంచిది.అత్యవసర పరిస్థితి ఏర్పడి ఎక్కువ దూరం కారులో ప్రయాణం చేయవలసివస్తే మధ్య మధ్య కొంతసేపు కారు ఆపుకొని, ఇటూ అటూ నాలుగు అడుగులు వేయడం, శక్తినిచ్చే ఆహారపదార్థాలు తీసుకోవడం మంచిది. ప్రసవమయ్యే సమయపు నెలలు దగ్గర పడుతున్నప్పుడు కారు డ్రైవింగ్‌ చేయడం అంతగా మంచిది కాదు. ఎనిమిది నెలల నుంచీ, ప్రసవమయ్యే వరకూ గర్భవతి ప్రయాణం చేయడం మంచిది కాదు. మరీ అవసరమైతే విమానంలోనూ, రైల్లోనూ డాక్టరును సంప్రదించి ప్రయాణం చేయాలి. అవసరమైన దూదులు, టానిక్కులు, నెల తప్పినప్పటి నుంచీ తాను వాడిన మందుల చీటీలు, వైద్యపరీక్షకు సంబంధించిన కాగితాలను వెంట ఉంచుకోవాలి.ఇలా ప్రయాణం చేసేటప్పుడు గర్భవతి తాగు జాగ్రత్తలు తీసుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: