అమ్మ అన్న పదంలో ఉంది ఒక ఆప్యాయత, అనురాగం. అమ్మ లేనిదే బ్రహ్మ కూడా లేడు. అమ్మంటే ఓ అనుబంధం అమ్మంటే ఓ అనురాగం,  ఆత్మీయత. సృష్టిలో అమ్మను మించిన అపురూపం లేదు. ఆమె ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే.మన పెదవి పలికే తొలి పలుకు అమ్మ.మనం భూమి మీదకు వచ్చాక మొదటి చూసేది అమ్మనే. ప్రతి బిడ్డకు వల్ల నాన్నని చూపించేది కూడా అమ్మ.. అలా కడుపులో బిడ్డ పడినప్పటినుడి భూమి మీదకు వచ్చే దాక మన ప్రతి విషయంలోను అమ్మ ప్రమేయం ఉండాలిసిందే. అమృతం తాగిన వాళ్లు దేవతలు దేవుళ్లు. అది కన్నబిడ్డలకు పంచే వాళ్లే అమ్మానాన్నలు...

 

 

 

అమృతం ఎలా ఉంటుందో తెలియదు గాని అమ్మ ప్రేమ ముందు అది  కూడా తక్కువే. శిశువైనా, పశువైనా తన తల్లి ఒడికే పరుగులు తీయునులే... జననీ అను మాటలోనే తరయించు మనిషి జన్మ’ అన్నాడు ఓ సినీకవి. అమ్మ అనే పదానికి అంతటి మహత్మ్యం ఉంది. బ్రహ్మదేవుడు సృష్టించిన వాటిలో అమ్మను మించిన అపురూపం లేదు. వాస్తవానికి బ్రహ్మ అమ్మను సృష్టించలేదు. అమ్మే బ్రహ్మను సృష్టించింది. అమ్మ లేనిదే బ్రహ్మ ఎక్కడి నుంచి పుట్టాడు. మన పెద్దలు సైతం ‘మాతృదేవోభవ', పితృదేవోభవ’ అంటూ అమ్మకే మొదటి స్థానం ఇచ్చారు.మనకు ఏ మాత్రం బాధ కలిగినా అమ్మనే తలుచుకుంటాం. బిడ్డకు బాధ కలిగిందన్న విషయం మన కంటే ముందు అమ్మకే తెలుస్తుంది. ఆకలి అవుతుందన్న విషయం మనకంటే ముందే అమ్మే పసిగడతుంది.

 

 

 

తన బిడ్డ విజయాలు సాధించినప్పుడు అమ్మ ఆనందానికి అవధులు లేవు.  అందుకే అమ్మ పిచ్చి తల్లి. మనం బయట తిరిగి తిరిగి ఇంటికి వెళితే గుమ్మంలోనే మన కోసం కళ్లల్లో వత్తులు వేసుకొని ఎదురుచూస్తుంది. పరీక్షల్లో తప్పామని నాన్న చెడామడా తిట్టేస్తుంటే, పోనీలే ఈ సారి కాకపొతే వచ్చే ఏడాది చదివి  పాసవుతాడంటూ  మనల్ని వెనకేసుకొస్తుంది.  ప్రపంచంలో అతి పేదవాడు ధనం లేని వాడు కాదు అమ్మ లేనివాడు. అమ్మ ప్రేమ దక్కినవాడు అత్యంత కోటీశ్వరుడు.అందుకే అమ్మ ఉన్నపుడే అమ్మని ఆనందంగా చూసుకుందాం.. లేనపుడు బాధపడే కంటే ఉన్నపుడు అపురూపంగా చూసుకుందాం.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: