బిడ్డకు జన్మ ఇచ్చిన తర్వాత తల్లి, బిడ్డ ఇద్దరు  జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రసవించిన అనంతరం మొదటివారంలోను,ఆరవ వారంలోనూ తల్లీ బిడ్డలిద్దరు వైద్య పరీక్షలు చేయించుకోవడం వలన బిడ్డ పెరుగుదలకి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం సాధ్యమవుతుంది.అలాగే బాలింతల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి అవేంటో ముందుగా తెలుసుకుని జాగ్రత్తలు వహించాలి.  బాలింతలో అధిక రక్తస్రావం,బాలింత జ్వరం రాకుండా చూడాలి. ప్రసవం తర్వాత 2-3 రోజుల వరకు సరిగ్గా తినకపోవడం, నీరు తాగకపోవడం వలన మలబద్దకం వస్తుంది. 

 

 

 

ప్రసవించిన వారంలోపు, ఒకటిన్నర నెల తరువాత మరోసారి తల్లీబిడ్డలిద్దరు పరీక్ష చేయించుకోవాలి. పూర్తిగా శక్తి వచ్చిన తరువాతనే ఆమె అన్ని పనులు చేయవచ్చు. అప్పటివరకు భర్త, ఇతర కుటుంబ సభ్యుల పూర్తీ సహకారం ఉండాలి .కాన్పు తర్వాత 2-3 రోజుల వరకు కొంతమందిలో విరేచనం సాఫీగా అయినా,నీరు తాగకపోవడం, సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం వంటి కారణాల చేత కొంతమందిలో మలబద్దకం వస్తుంది.సిజేరియన్ ఆపరేషన్ చేయించుకున్నప్పుడు పొట్ట మీద వేసే కుట్లలో చీము పట్టకుండా జాగ్రత్త పడాలి లేకపొతే మలేరియా, టైఫాయిడ్, నిమోనియా వంటి ఇతర బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉంది. ఈ ఇన్ఫెక్షన్స్‌ని అశ్రద్ధ చేస్తే అవి రక్తం ద్వారా శరీరమంతటా ప్రాకి ప్రాణాపాయానికి దారితీసే ప్రమాదం ఉంది.

 

 

 

 

కొంతమంది బాలింతల్లో కాన్పు తర్వాత 3-5 రోజుల తర్వాత డిప్రెషన్ వస్తుంది. రక్తహీనత, బిడ్డ పెంపకం బాధ్యతల గురించిన భయం, ఆందోళన, నిద్రలేమి, కొన్ని హార్మోన్లలో మార్పులు, కుటుంబకలహాల వంటి ఎన్నో కారణాల వల్ల ఇది రావచ్చు. కొంతమందిలో కుటుంబసభ్యుల సహకారం వల్ల 2-3 రోజుల్లోనే కొందిరిలో పరిస్థితి చక్కబడుతుంది. కొంతమందిలో మాత్రం పరిస్థితి తీవ్రమై సైకోసిస్ స్థితిలోకి వెళ్తారు. దీనికి చికిత్స అవసరం.ప్రసవం తర్వాత కొందరు మహిళలకు రొమ్ము సమస్యలు ఎదురవుతాయి. వీరికి రొమ్ము లో నొప్పులు ఏర్పడతాయి. వారు వెంటనే డాక్టర్‌ను సంప్రదించి వైద్యం చేయించుకోవాలి. రొమ్ములలో నొప్పి ఎక్కువగా ఉండే నొప్పి తగ్గించే మందులను వాడాల్సి ఉంటుంది.ప్రసవం అయిన అరగంట లోపు వచ్చేపాలు ముర్రుపాలు, ఎంతో విలువైనవి వీటిని వృదా చేయకూడదు వీటిని బిడ్డకు తాగించడం వలన బిడ్డలో రోగనిరోధక శక్తి పెంపొందించవచ్చు .

మరింత సమాచారం తెలుసుకోండి: