ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలో అతి జాగ్రత్తగా ఉండాలి..ముఖ్యంగా చెప్పాలంటే శరీరానికి కేరింగ్ ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే హార్మోన్ల ప్రభావం తగ్గుతుంది.. అందుకే డాక్టర్లు కూడా ఆడవాళ్ళకు శక్తిని ఇచ్చే వాటిని ఎక్కువగా టాబ్లెట్ల రూపంలో ఇస్తుంటారు.  సరైన ఆహారం తీసుకోవాలని చెబుతుంటారు. అయితే ఎంత తిన్నా కొంతమంది అనారోగ్యంగా నే కనిపిస్తుంటారు.. ఇటువంటి విటమిన్లు సమయాల్లో ఆడవారి శరీరానికి కావలసిన దానికి అన్నా ఎక్కువగా అవసరం.. అసలు విషయానికొస్తే.. ప్రెగ్నెన్సీ సమయంలో కొన్ని లక్షణాలను కోల్పోతారు.. అవేంటో ఇప్పుడు చూద్దాం..


ఎక్సెస్ గ్యాస్:


ప్రెగ్నన్సీ సమయంలో చాలామంది మహిళలు ఎదుర్కునే సమస్య గ్యాస్ ప్రాబ్లెమ్. తొమ్మిది నెలల సమయంలో ఎప్పుడైనా గ్యాస్ ప్రాబ్లమ్ ఎదురవవచ్చు. ప్రొజెస్టెరాన్ హార్మోన్ అనేది ప్రెగ్నన్సీ సమయంలోని అదనపు గ్యాస్ ను కలిగించే ముఖ్య కారణమని గుర్తించాలి. ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేయడానికి బాడీ అనేది ఎక్కువ ప్రొజెస్టెరాన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్ శరీరంలోని మజిల్స్ ను ఇంటస్టినల్ మజిల్స్‌తో సహా రిలాక్స్ చేస్తుంది. తీసుకొనే ఆహారం కొద్దిగా అయినా కూడా గ్యాస్ సమస్యకు దారితీస్తుంది.


అదనపు హెయిర్ గ్రోత్:


ప్రెగ్నన్సీ సమయంలో హెయిర్ గ్రోత్ ను గమనించవచ్చు. తలపై హెయిర్ గ్రోత్ సంతోషమే..కానీ అవాంఛిత రోమాలు మాత్రం ఇబ్బంది కలిగిస్తాయి. ప్రెగ్నన్సీ సమయంలో హార్మోనల్ ఛేంజెస్ అనేవి దట్టమైన, పొడవైన అలాగే నల్లని వెంట్రుకల పెరుగుదలకు కారణమవుతాయి. ముఖం, చెస్ట్, పొత్తికడుపు అలాగే ఆర్మ్స్ పై హెయిర్ దట్టంగా పెరుగుతుంది. ఈ సమస్యను డీల్ చేయడానికి సురక్షితంగా ట్వీజ్, వ్యాక్స్ అలాగే షేవ్ చేసుకోవాలి. బ్లీచెస్ అలాగే డెపిలేటరీస్ వంటి కెమికల్స్ ను అవాయిడ్ చేయాలి.


చర్మం పై నల్లని మచ్చలు..



ప్రెగ్నన్సీ సమయంలో చాలామంది మహిళల చర్మంపై డార్క్ స్పాట్స్ లేదా ప్యాచెస్ వస్తాయి. ముఖంపై అలాగే శరీరంలోని ఇతర భాగాలపై ఈ స్పాట్స్ ను గమనించవచ్చు. ఈస్ట్రోజెన్ ఆలాగే ప్రొజెస్టెరోన్ లెవెల్స్ పెరగడం వల్ల ఇలా జరుగుతుంది. హైపర్ పిగ్మెంటేషన్ తలెత్తుతుంది. ప్రెగ్నన్సీ సమయంలో హైపర్ పిగ్మెంటేషన్ ను మీరు ఆపలేరు. కాకపోతే బయటికి వెళ్లేముందు సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం కొంతవరకు హెల్ప్ చేస్తుంది. గర్భిణీలు ఎంత వీలయితే అంత ఎండలోకి వెళ్ళకపోవడం మంచిది. ఒకవేళ వెళితే తగు జాగ్రత్తలు పాటించాలి..



వీటితో పాటుగా వాసనను గుర్తించే సామర్థ్యం.. ఇలా అనేక సమస్యలు గర్భిణీ స్త్రీలలో కనిపిస్తుంటాయి.. అయితే వాటిని అధిగమించడం అంటే విటమిన్లు , ప్రొటీన్లు ఎక్కువగా లభించే ఫుడ్ ను తీసుకోవాలి అని నిపుణులు అంటున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: