మహిళలు గర్భం దాల్చినప్పడి నుండి ప్రసవం అయ్యేవరకు చాల జాగ్రత్తగా ఉండాలి. అయితే చాల మంది మహిళలు ఎలాంటి ఆహారం తీసుకోవాలో అర్ధం కాక చాల సతమతం అవుతుంటారు. అలాంటి వారికి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఈ ఆహార పదార్థాలను తీసుకోవచ్చు, వీటిని తీసుకోకూడదు అనే సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటారు. ఇక గర్భం దాల్చినప్పుడు మహిళలు ఎంతో పోషక పదార్థాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా వారు ఎంతో ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, శిశువు పెరుగుదలకు ఎంతగానో తోడ్పడుతుంది. డెలివరీ అయిన తర్వాత మహిళలు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదో ఇక్కడ చూద్దమా.

ఇక కేవలం గర్భం దాల్చినప్పుడు మాత్రమే కాకుండా డెలివరీ అయిన తర్వాత కూడా మహిళలు ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డెలివరీ అయిన తర్వాత బిడ్డ పాలు తాగుతుంది కాబట్టి బాలింతలు పోషక పదార్థాలతో కూడిన ఆహారంతో పాటు త్వరగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా తల్లి ఆరోగ్యంగా ఉండడంతో పాటు బిడ్డ కూడా ఎంత ఆరోగ్యవంతంగా ఉంటుంది.

అంతేకాదు గర్భధారణ సమయంలో మహిళలు కాఫీ తాగకూడదు అని చెబుతుంటారు. కాఫీ ఎక్కువగా తాగటం వల్ల అందులో ఉన్న కెఫిన్ కొంతవరకు అనారోగ్య సమస్యలను తలెత్తుతుంది.అయితే డెలివరీ అయిన తర్వాత కూడా కాఫీని ఎక్కువగా తాగకూడదని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇలా తాగడం ద్వారా కెఫిన్ తల్లి పాల ద్వారా బిడ్డకు చేరి బిడ్డ ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తుంది. ఇవే కాకుండా ఎక్కువ మసాలా తో కూడుకున్న ఆహార పదార్థాలను, ఫాస్ట్ ఫుడ్, బ్రోకలీ వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా తరుచు కడుపులో మంట, కడుపునొప్పి తలెత్తే అవకాశం ఉండటం వల్ల బాలింతలు ఇటువంటి ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: