ఆర్య కోలీవుడ్ లో హీరోగా కొనసాగుతున్నాడు. ఇతడు చేసిన 'రాజా రాణి' సినిమా తమిళ్ తో పాటు తెలుగు లో కూడా మంచి విజయాన్ని అందుకుంది. అయితే రాజా రాణి కంటే ముందే ఆర్య  తెలుగు సినిమాలో నటించాడు. గుణశేఖర్ దర్శకత్వం లో అల్లు అర్జున్ హీరోగా 'వరుడు' అనే సినిమా వచ్చింది. ఇందులో మెయిన్ విలన్ గా ఆర్య నటించాడు. ఇదే కాదు ఆర్య తమిళ్ లో  చేసిన కొన్ని సినిమాలు తెలుగు లో వచ్చేసరికి తెలుగు ప్రేక్షకులకు ఆర్య మరింతగా దగ్గరైయ్యాడు.

అసలు విషయంలోకి వెళ్తే జర్మనీ లో ఆర్య పై కేసు నమోదైయింది. జర్మనీకి చెందిన విట్జా అనే మహిళ ఈ కేసును నమోదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఏంటంటే కరోనా సమయం లో ఆర్యకి డబ్బు అవసరం ఉందంటే నన్నుఅడిగాడని నేను అతడికి డబ్బు ఇచ్చానని ఇప్పుడు ఆ డబ్బు గురించి అడిగితే పట్టించుకోవడం లేదని తన ఫిర్యాదు లో తెలిపింది. తిరిగి డబ్బు ఇవ్వకుండా ముఖం చాటేస్తున్నాడని, ఫోన్ చేస్తే సమాధానం ఇవ్వడం లేదని అంటోంది.

తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, నన్నే కాకుండా ఇంకొంతమందిని కూడా ఆర్య మోసం చేసాడని విట్జా పోలీసులకు తెలిపింది. అయితే ఈ కేసు విషయం పై ఆర్య ఇప్పటివరకు స్పందించకపోవడం విశేషం. మరోవైపు తన అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా తనకి సపోర్ట్ గా నిలబడడం బట్టి చూస్తే ఆర్య ఈ తప్పు చేసి ఉండడు అని అభిమానులు నమ్ముతున్నారు. ఆర్య సినిమా కెరీర్ చూస్తే ఎత్తుపల్లాల మధ్య సాగుతుంది. ఒక రకంగా హిట్ లేక సతమతమవుతున్నాడు. ఈ నేపథ్యం లో కేసు కోర్ట్ అంటే అది తన కెరీర్ కె పెద్ద దెబ్బ పడుతుంది. కాబట్టి ఆర్య ఈ విషయం పై తొందరగా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: