గర్భధారణ సమయంలో గర్భిణులు అనేక సమస్యలకు గురవుతుంటారు. గర్భం దాల్చిన మొదటి రోజు నుండి బిడ్డకు జన్మానించే వరకు ప్రతి విషయంలో చాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇక ప్రసవం ఆసుపత్రిలో జరిగితే నర్సులు, డాక్టర్లు మిమ్మల్ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉంటారు. మీ బిడ్డ కు సంబంధించిన జాగ్రత్తలు వారు తీసుకుంటారు. మీ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని విషయాలనూ వారు జాగ్రత్తగా చేసుకుంటారు కాబట్టి మీరు భయపడాల్సిన పని ఏమి ఉండదు.

అయితే ప్రతి ముగ్గురిలో ఒకరికి సిజేరియన్‌ పడుతుందని కొన్ని లెక్కలు చెబుతున్నాయి. అయితే ఇది ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. కాబట్టి మీ బిడ్డ ఉన్న పరిస్థితిని బట్టీ మీరు సిజేరియన్‌కు వెళ్ళవచ్చో లేదో డాక్టర్లు చెప్తారు.వారు చెప్పిన విధంగా చేయడం తల్లికి బిడ్డకు మంచిది. ప్రతినెలా ఎప్పుడు చెకప్ కి రమ్మంటే అప్పుడు వెళ్లి మందులు వాడుతూ ఎప్పటికప్పుడు డాక్టర్ సలహాలు పాటిస్తూ ఉండాలి.

గర్భిణులు మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆరోగ్యవంతమైన బిడ్డ కోసం పౌష్టికాహారం తీసుకోవాలి .సొంతంగా మందులు వాడటం , ఎక్స్ రేలు తీయించుకోవడం వంటివి అసలు చేయకండి. ఎత్తుమడమల చెప్పులు వాడకుండా ఉండడం మంచిది. ప్రగ్నెంట్ గా ఉన్నప్పుడు స్త్రీలు సంతోషంగా ఉండడం వలన పుట్టబోయే బిడ్డ కూడా అలానే ఉంటుంది. మొదటి మూడు నెలలు , చివరి నెలలో దూరప్రయాణాలు , కారు స్కూటర్ నడపడం వంటి వాటికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

ఇక రాత్రి నిద్ర 8 గంటల నుండి 10 గంటలు , పగలు 1 గంట నిద్ర లేదా విశ్రాంతి అవసరం ఉంటుంది . నిద్ర పోవునపుడు ఒక ప్రక్కకు వీలైతే ఎడమ వైపు తిరిగి పాడుకుంటూ ఉండాలి .ధనుర్వాతం నుండి రక్షణకోసము టెటనస్ టాక్షాయిడ్ ఇంజక్షన్‌ లు తీసుకోవడం మంచిది . రక్తస్రావం , ఉమ్మనీరు పోవడం ,బిడ్డ కదలిక తగినట్లు లేనప్పుడు , కడుపు నొప్పి వచ్చినా వెంటనే డాక్టర్ని సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: