భారత దేశంలో క్రికెట్ ఓ మతంగా ఏర్పడిందన్న విషయం అందరికీ తెలిసిందే.. అలాంటి క్రికెట్ ను ఎంతగానో అమితమైన ఇష్టం తో చూస్తూ ఉంటారు మన దేశస్తులు.. ఆ ఇష్టం గమనించిన మన క్రికెట్ నిర్వాహకులు 2008 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహించి మరింత ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు.. ఈ లీగ్ లో ఫారెన్ ప్లేయర్ లతో పాటు దేశవాళీ క్రీడాకారులు కూడా కలిసి ఆడి ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని గత 13 సంవత్సరాలుగా అందిస్తున్నారు.. ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 8 జట్లు కీలకంగా ఉంటాయి.. ఆ జట్లు ఏమిటి ఆ యజమానులకు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

ధోని నాయకుడిగా వ్యవహరిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీని ఇండియా సిమెంట్స్ కొనుగోలు చేసింది.. ఆ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అయినా ఎన్.శ్రీనివాసన్ సిఎస్ కె యాక్టివిటీలే కాకుండా సూపర్ కింగ్స్ క్రికెట్ లిమిటెడ్ అనే కంపెనీ కూడా నడుపుతున్నాడు.. జిఎంఆర్ గ్రూప్ ఢిల్లీ జట్టును మొదట్లో కొనుగోలు చేసింది .. ప్రస్తుతం జెఎస్ డబ్లూ గ్రూపు ఇందులో భాగస్వామిగా ఉంది.. గతంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ గా ఉన్న ఈ ఫ్రాంచైజీ పేరును ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ గా మార్చారు.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. కేఎల్ రాహుల్ నాయకత్వం వహిస్తున్న ఈ ఫ్రాంచైజీ కి  డాబర్ కు చెందిన మోహిత్ బర్మన్, వాడియా గ్రూప్ అధినేత నెస్ వాడియా, పీ జెడ్ ఎన్ జెడ్ మీడియా గ్రూప్ అధినేత ప్రీతిజింటా, అపీజయ్ సురేంద్ర గ్రూప్ నుంచి కరణ్ పాల్ లు ఓటరుగా ఉన్నారు .

ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కోల్ కతా నైట్ రైడర్స్ కి ఓనర్ గా ఉన్నాడు.. ముంబై ఇండియన్స్ కి మొదటి నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓనర్ గా ఉంది..నేత అంబానీ దీని వ్యవహారాలు చూస్తారు.. రాజస్థాన్ రాయల్స్ టీమ్ మొత్తం 6 మంది ఓటర్లు ఉన్నారు.. ట్రెస్కో ఇంటర్నేషనల్ లిమిటెడ్ నుంచి అమీషా హతీరమని, ఎమర్జింగ్ మీడియా లిమిటెడ్ నుంచి మనోజ్ బడాలే, బ్లూ వాటర్ ఎస్టేట్ లిమిటెడ్ నుంచి లచ్లన్ ముర్థోజ్, కుక్కి ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ నుంచి రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి,  మాజీ ఆసీస్ క్రికెట్ ప్లేయర్ షేన్ వార్న్ లు లో ఉన్నారు.. కోహ్లీ చెప్పింది భావిస్తున్నా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మొదట్లో లిక్కర్ మాల్యా ఓనర్ గా ఉండగా ఆ తర్వాత యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ కు చెందిన ఆనంద్ కృపలు ఓనర్ అయ్యాడు.. సన్ రైజర్స్  హైదరాబాద్ కు సన్ నెట్ వర్క్  ఓనర్ అయిన కళానిధి మారన్ యజమాని గా ఉన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: