ప్రెగ్నెసీ సమయంలో గర్భిణులు అనేక ఒత్తిళ్లకు గురవుతుంటారు. ఇక మరికొంత మంది గర్భిణులు నెలలు నిండేకొద్దీ బరువు పెరుగుతుంటారు. ఇక ఆ భారం మొత్తం పాదాలపైనే పడుతుంది. అయితే చీలమండ దగ్గర వాపు, వేళ్లపై ఒత్తిడి ఏర్పడుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ సమస్యను చిన్నచిన్న వ్యాయామాల ద్వారా అధిగమించవచ్చునని అన్నారు. గర్భిణులు కాళ్లపై ఒత్తిడిని తగ్గించే ఈ వర్కవుట్లు ఎంతగానో ఉపశమనం కలిగిస్తాయని వెల్లడించారు. అయితే ఎలాంటి చేస్తే ఈ సమస్యను అధిగమించవచ్చో ఒక్కసారి చూద్దామా.

గర్భిణులు ముందుగా చాపమీద కూర్చోవాలి. ఆ తరువాత కాళ్లు రెండూ ముందుకు చాపాలని అన్నారు. ఇక దీనిని ‘దండాసన స్థితి’ అంటారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. గర్భుణులు కాలి వేళ్లను ముందుకు స్ట్రెచ్‌ చేయాలి. చీలమండసహా పాదాలను వీలైనంత వరకూ ముందుకు స్ట్రెచ్‌ చేస్తుండాలి. ఇక ఇలా 20 సార్లు ప్రయత్నించాలని అన్నారు. అంతేకాదు.. కాళ్లను దండాసన స్థితిలో ఉంచాలని చెబుతున్నారు. ఇక పాదాలను చీలమండసహా క్లాక్‌వైజ్‌, యాంటీ క్లాక్‌వైజ్‌గా రొటేట్‌ చేస్తుండాలి. అలా 20 సార్లు చేసి తిరిగి దండాసన స్థితికి రావాలని చెబుతున్నారు.

ఇక ఇప్పుడు పాదాలను చీలమండనుంచి వేళ్లవరకు ముందుకు, వెనక్కి స్ట్రెచ్‌ చేస్తుండాలి. ఈ తరుణంలో ఎడమపాదాన్ని ముందుకు స్ట్రెచ్‌ చేసినప్పుడు కుడిపాదాన్ని వెనక్కి, కుడిపాదాన్ని ముందుకు అన్నప్పుడు ఎడమపాదాన్ని వెనక్కి స్ట్రెచ్‌ చేయాలని అన్నారు. ఇక ఇలా 20 సార్లు చేస్తుండాలి. అంతేకాక.. మళ్లీ దండాసన స్థితిలోకి వచ్చిన తర్వాత మోకాళ్ల కింది భాగాన్ని చాపకు బాగా అదిమి ఉంచాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలా 20 సార్లు చేసి కాళ్లను యథాస్థితికి తీసుకురావాలన్నారు.

ఆ తరువాత మోకాలి చిప్పను వెనక్కి నెడుతూ కాళ్లను స్ట్రెచ్‌ చేయాలి. ఇలా 20 సార్లు ప్రయత్నిస్తుండాలి. ఇక చివరగా కాళ్లను వదులు చేసి ఎడమనుంచి కుడికి కదిలించి తిరిగి దండాసన స్థితికి రావాలని చెబుతున్నారు. అలా చేయడం వలన కాళ్ల నొప్పులు, వేళ్లపై ఒత్తిడి తగ్గుతాయని అన్నారు. అంతేకాదు.. కాళ్లు రిలాక్స్‌ అవుతాయన్నారు. ఇక చీలమండ దగ్గర వాపు ఉంటే తగ్గుతుందని అన్నారు. గర్భిణులకు అధిక రక్తపోటు, వాంతులు కావడం, తల తిరగడం వంటి సమస్యలు ఉన్నట్లయితే ప్రయత్నించొద్దని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: